తెలుగు సినిమాల్లో నందమూరి వంశం నుంచి వచ్చిన మూడో తరం హీరో జూనియర్ ఎన్టీఆర్. హరికృష్ణ తనయుడిగా తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్ స్టార్ హీరో కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కేవలం రెండేళ్లలోనే హీరో నుంచి స్టార్ హీరోగా ఎదిగి నందమూరి మూడో వారసత్వాన్ని ఘనంగా చాటాడు. ఎన్టీఆర్ కు తిరుగులేని స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన ఆ సినిమానే ‘సింహాద్రి’. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తిరుగులేని రికార్డులు సృష్టించింది. ఈ సినిమా విడుదలై నేటికి 17 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

ఎన్టీఆర్ ను స్టార్ గా నిలబెట్టిన ఆ సినిమా 2003 జూలై 4న విడుదలైంది. కథలోని ఇంటెన్సిటీని తెరపై పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడంలో ఎన్టీఆర్ బాగా సక్సెస్ అయ్యాడు. అప్పటికి వయసులో రెండు పదులు దాటకపోయినా బలమైన పాత్రను అంతే గంభీరంగా పోషించాడు. సినిమా అంతా కథ ఉన్నా ప్రత్యేకించి ఎన్టీఆర్ పాత్ర.. తన నటనతో సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు. కేరళ నేపథ్యం, కొవ్వూరులో తెరకెక్కించిన ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. దీంతో నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ లో కొత్త స్టార్ కనిపించాడు. తెలుగు తెరకు మరో మాస్ హీరో దొరికాడని ప్రేక్షకులు భావించారు.

IHG's 'Simhadri' <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BLOCKBUSTER HIT' target='_blank' title='blockbuster-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>blockbuster</a> Story

 

తండ్రి విజయేంద్రప్రసాద్ కథను రాజమౌళి అంతే గ్రాండ్ గా తెరకెక్కించారు. కీరవాణి సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్టే. వీఎంసీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత దొరస్వామిరాజు ఈ సినిమాను నిర్మించారు. తిరుగులేని రికార్డులతో 150 సెంటర్లలో 100 రోజులు ఆడింది. 175 రోజులు కూడా డైరక్ట్, షిఫ్టులతో కలిపి దాదాపు 55 కేంద్రాల్లో రన్ అయింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఆ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Junior IHG Records ! - Forum

మరింత సమాచారం తెలుసుకోండి: