మన తెలుగు లో కీరవాణి సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సంగీతం అనగానే చాలా మంది అలా వింటూ ఉంటారు. స్టార్ హీరోలు కూడా ఆయన కోసం ఎదురు చూసి మరీ తమ సినిమాలకు సంగీతం తీసుకున్న రోజులు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన సంగీతం అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు. ఎన్టీఆర్ తో కలిసి ఆయన రెండు మూడు సినిమాలు చేసారు. ఈ రెండు మూడు సినిమాలకు కూడా అందమైన పాటలు అందించారు. ఆయన సంగీతం గురించి ఎన్నో సందర్భాల్లో ఎన్టీఆర్ కూడా ప్రస్తావించారు అని చెప్తూ ఉంటారు. 

 

అలాగే తన కుమారుడు బాలకృష్ణ కూడా ఎన్టీఆర్... కీరవాణి సంగీతం గురించి చెప్పే వారు అని అంటారు. ఇక స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి వెంకటేష్ వంటి వారు అప్పుడే హీరోలుగా వస్తున్న రవి తేజా వంటి వారు కూడా ఆయనతో సినిమాలు అనగానే సంగీతం ఏ రేంజ్ లో ఉంటుంది అంటూ  ఎంతో హుషారు గా సినిమాలు చేయడానికి ముందుకు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు ఆయన సంగీతం కోసం ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సహా చిరంజీవి బాలకృష్ణ ఇప్పుడు ప్రభాస్ వంటి వారు కూడా ఆయన తో సినిమా అనగానే చాలా హుషారు గా ఉంటారని అంటారు. 

 

ఇక ఆయన సంగీతం కోస౦ దర్శకులు కొన్ని కొన్ని సన్నివేశాలను ప్లాన్ చేస్తారు అని చెప్తూ ఉంటారు. ఆయన సంగీతం కోసమే చాలా మంది స్టార్ దర్శకులు కొన్ని సీన్స్ రాసి వాటిని ప్రత్యేకంగా తమ తమ సినిమాలలో ఉంచారు అని అంటారు. అందులో చిరంజీవి కూడా ఒక హీరో అని అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: