తెలుగు చిత్ర పరిశ్రమ లో కీరవాణి సంగీతం గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సంగీతం అనగానే చాలా మంది అలా వింటూ ఉంటారు. ఆయన సంగీతం తో పాటుగా ఆయన గాత్రం కూడా అంతే.. స్టార్ హీరోలు కూడా ఆయన కోసం ఎదురు చూసి మరీ తమ సినిమాలకు సంగీతం తీసుకున్న రోజులు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన సంగీతం అంటే ఎన్టీఆర్, ప్రభాస్ లకి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు. 

 

 


అప్పటి లో ఎన్టీఆర్ తో కలిసి ఆయన రెండు మూడు సినిమాలు చేసారు. ఈ రెండు మూడు సినిమాలకు కూడా అందమైన పాటలు అందించారు. అలాగే తన కుమారుడు బాలకృష్ణ కూడా కీరవాణి సంగీతం గురించి చెప్పే వారు అని అంటారు. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు ఆయన సంగీతం కోసం ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సహా చిరంజీవి బాలకృష్ణ ఇప్పుడు ప్రభాస్ వంటి వారు కూడా ఆయన తో సినిమా అనగానే చాలా హుషారు గా ఉంటారని అంటారు.

 

 


అసలు విషయాని కొస్తే..  ప్రభాస్ సినిమాల కు  అంత క్రేజ్ రావడానికి కారణం ఎం ఎం కీరవాణి గారి సంగీతం అనే చెప్పాలి.. ఆయన ఆధ్వర్యం లో వచ్చిన బాహుబలి సినిమాలు రెండు ఆయన స్థానాన్ని ఆ రేంజు లో తీసుకెళ్లాయి. అందుకే ఆయన సంగీతం కోస౦ దర్శకులు  కొన్ని సన్నివేశాలను ప్లాన్ చేస్తారు అని చెప్తూ ఉంటారు. అలాంటి సంగీత సరస్వతి పుత్రుడు కీరవాణి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని విజయాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. మీ సంగీతం అందరి మనసును మరింత రంజింప చేయాలనీ ఆకాంక్షిస్తూ.. హ్యాపీ బర్త్ డే కీరవాణి గారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: