తెలుగు సంగీతం లో మూడు తరాలకు వారధిగా... అసలు సిసలైన మెలోడీ సంగీతానికి నిలువుటద్దంగా.. భక్తి పాటలకు కేరాఫ్ అడ్రస్ గా ... రక్తి పాటలకు చిరునామాగా.. తన సంగీతంతో రాళ్ల నైనా కలిగించగల ఘనుడిగా ... మూడు జనరేషన్ ల  నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తన పాటలతో ఎంతో మందిని ఉర్రుతలూగిస్తున్న  సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి, తెలుగు చిత్ర పరిశ్రమలో  సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ప్రస్థానం అద్భుతంగా సాగింది అనే చెప్పాలి, నేటితరం ఏ యువ సంగీత దర్శకుడు కూడా కీరవాణి అందించిన అద్భుతంగా మెలోడీ సాంగ్స్ అందించలేడు  అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 ఓలలాడించే ఆ మెలోడీ ని తన జోడీగా చేసుకొని కీరవాణి స్వరకర్తగా టాప్ రేంజ్ కు చేరుకున్నారు. ఆణిముత్యాల్లాంటి మెలోడీ స్వరాలతో తెలుగు ప్రేక్షకులందరికీ ఉర్రూతలూగించి మెలోడీ బాహుబలి గా ఎంతో ఖ్యాతిని  గడించారు ఎం.ఎం.కీరవాణి. తెలుగు సంగీతాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుల్లో మొదటి స్థానంలో ఉంటారు ఎం.ఎం.కీరవాణి. అయితే మొదటి సినిమా మనసు.మమత తర్వాత చేసిన సీతారామయ్యగారి మనవరాలు అనే సినిమాతో కీరవాణి పేరు తెలుగువారి ప్రతి ఇంటా వినిపించింది అని చెప్పాలి. 

 

 ఇక ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతాన్ని అందించి టాప్ రేంజికి ఎదిగారు ఎం.ఎం.కీరవాణి. అయితే ఇప్పటివరకూ కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో ఎన్నో అనే చెప్పాలి. ప్రతి సినిమాలో కూడా ఎక్కడ ప్రేక్షకులు అసంతృప్తి చెందకుండా అందరినీ సాటిస్ఫై చేస్తూ అద్భుతమైన పాటలను సమకూర్చారు ఈ  స్వరకర్త. మామూలుగా అయితే స్టార్ డైరెక్టర్లకు పెద్ద ఇల్లు ఉంటుంది కానీ కీరవాణి కి  మాత్రం అతి చిన్న ఇల్లు ఉందంట. ఒక ఇంటర్వ్యూలో కీరవాణి హాజరైనప్పుడు మీ ఇంట్లో ఎలాంటి సంగీత ఇన్స్ట్రుమెంట్స్  ఉన్నాయ్ అని ప్రశ్నించగా.. మా ఇళ్లు చాలా చిన్నది ఎలాంటి సంగీత ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకోవడానికి తగిన స్థలం లేదు అని అందుకే మా ఇంట్లో ఎలాంటి సంగీతానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్  పెట్టుకొను అని  కీరవాణి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: