ఈ డిజిట‌ల్ యుగంలో ప్ర‌తిభ అనేదానికి ఎల్లలు లేకుండా పోతోంది. ఎవ‌రి టాలెంట్ అయినా ప్ర‌పంచ వ్యాప్తంగా పాకిపోతోంది. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ప్ర‌తిభ‌కు మంచి గుర్తింపు కూడా వ‌స్తోంది. అది మారుమూల ప‌ల్లెల‌కు కూడా వెళుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌న టాలీవుడ్ క్రేజీ హీరోలు న‌టించిన పాట‌లకు విదేశాల‌కు చెందిన వారి వీరాభిమానులు కూడా డ్యాన్సులు చేస్తున్నారు. ఇటీవ‌ల ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాకు టిక్ టాక్ లో డ్యాన్సులు చేసి ఇక్క‌డ వారి అభిమానుల‌ను ఫుల్ ఖుషీ చేశారు.

 

ఇక ఇప్పుడు టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పాట‌ల‌కు జ‌పాన్‌లో ఉన్న ఆయ‌న అభిమానులు డ్యాన్సులు చేశారు. ఈ వీడియో ఇప్పుడు జోర‌గా వైర‌ల్ అవుతోంది. ర‌జ‌నీకాంత్ త‌ర్వాత ఆ రేంజ్‌లో జ‌పాన్‌లో ఎన్టీఆర్‌కు మాత్ర‌మే అభిమానులు ఉన్నారు. ఇక బాహుబలి సిరీస్ సినిమాలతో పాటు అక్కడ ఎన్టీఆర్ సినిమాల్ని చూసేందుకు అభిమానులు ఎగబడుతుంటారు. గ‌తంలో కూడా జ‌పాన్‌లో ఆయ‌న అభిమానులు ఎన్టీఆర్ సాంగ్స్‌కు డ్యాన్సులు చేసిన వీడియోఉ వైర‌ల్ అయ్యాయి.

 

ఇక తాజాగా ఎన్టీర్ జ‌పాన్ అభిమాని ఆయ‌న న‌టించిన ఓ సాంగ్‌కు డ్యాన్సును సేమ్ టు సేమ్ దించేశాడు. ఎన్టీఆర్ - సమీరా రెడ్డి జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన అశోక్ (2006) సినిమాలోని గోల గోల పాటకు జ‌ప‌నీ జంట సేమ్ టు సేమ్ స్టెప్పుల‌ను ఎన్టీఆర్ - స‌మీరా లా అచ్చు గుద్దిన‌ట్టు దింపేశారు. విచిత్రం ఏంటంటే ఆ సాంగ్‌లో ఎన్టీఆర్  - స‌మీరా మేక‌ప్ ను సైతం య‌ధావిథిగా దింపేశారు. ఇప్పుడు ఈ వీడియోను ఎన్టీఆర్ ఫ్యాన్స్ షేర్ చేసుకుని ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: