దేశంలో కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే కరోనా రక్కసి ఎంతగా మనిషి బతుకులు మారుస్తున్నాయంటే.. పూలు అమ్మిన చోటే కట్టెలమ్మే పరిస్థితి ఏర్పడుతుంది.  ఎంతో హుందాగా బతికిన వారు ఇప్పుడు రోడ్డున చిరు వ్యాపారులుగా మారిపోయారు. ఉన్నత చదువు చదివిన వారు సైతం ఇప్పుడు కూలీ పనులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ ముఖ్యంగా రవాణా, విద్యా, సినీ పరిశ్రమలపై పడింది. షూటింగ్స్ ఆగిపోయాయి.. ప్రైవేట్ స్కూల్స్ బంద్ అయ్యాయి.. ప్రయాణీకులు తగ్గిపోయారు.  ఈ వ్యవస్థలపై ఆధారపడిన వారు ఇప్పుడు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు.

 

తాజాగా  ఓ దర్శకుడు ఏకంగా కిరాణ కొట్టు పెట్టుకోవాల్సి వచ్చింది. సినిమాలు తీసే అవకాశం లేకపోవడంతో కొత్త వ్యాపారంలో చేరిపోయాడు.  చెన్నైకి చెందిన సినీ దర్శకుడు ఆనంద్ కుటుంబ పోషణ భారం కాకుండా ఉండేందుకు ఈ విధంగా కిరాణ కొట్టు తెరిచాడు.  గత పది సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉంటూ వచ్చానని.. పలు సినిమాలు కూడా తెరకెక్కించానని.. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. వందరోజులకు పైగా సినీ పరిశ్రమ మూసుకు పోయిందని.. దాని వల్ల ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని.. అందుకే కుటుంబ పోషన కోసం స్నేహితుడి సాయంతో కిరాణ షాపు తెరిచినట్టు చెప్పాడు.

 

దీంట్లో నిత్యావసరాలను తక్కువ ధరలకే అమ్ముతున్నట్టుగా చెబుతున్నాడు. సినిమా హాల్స్ తెరిచి, షూటింగ్స్ ప్రారంభం అయ్యే వరకు ఇలా చేయక తప్పదని పేర్కొన్నాడు. కాగా దర్శకుడు  ఆనంద్ గతంలో ‘ఓరు మజాయ్ నాంగు సారాల్’ ‘మౌనా మజాయ్’ సినిమాలు చేసి తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.ప్రస్తుతం అతడు ‘తునింతు సీ’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇక  కరోనా తర్వాత దీన్ని పూర్తి చేసి విడుదల చేస్తామని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: