దేశంలో కొంత మంది అన్ని అవయవాలు ఉన్నా.. తాము జీవితంలో ఏం సాధించలేకపోతున్నా మన్న నిరుత్సాహంలో ఉంటారు.  తమ జీవితం ఎప్పుడూ ఇలాగే ఉంటుందన్న బ్రమలో బతుకుతుంటారు. కానీ కొంత మంది పుట్టుకతోనే లోపం ఉన్నా.. జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదల దీక్షతో తాము అనుకున్నది సాధిస్తుంటారు. ఇలా ఎంతో మంది అంగవైకల్యాన్ని జయించారు.   ఇండస్ట్రీలో ఏఆర్ రెహమాన్ సంగీతం అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం త‌మిళంలో రాబోయే ప్ర‌ముఖ హీరో విక్ర‌మ్ మూవీ కోబ్రా. ఈ సినిమాకు ఏ.ఆర్. రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  విక్రమ్ - రహమాన్ కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చాయి.. అందులో సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. 

 

ఈ మూవీలో రెహ‌మాన్ ట్యూన్ చేసిన తుంబి తుల్లాల్ పాట‌కు దృష్టి లోపం ఉన్నఒక అమ్మాయి ట్యూన్ చేసింది. అన్ని అవ‌య‌వాలు బాగా ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ ప‌నిపాటా లేకుండా ఖాళీగా ఉంటారు కొంత‌మంది.  కానీ ఈ చిన్నారిని చూస్తే ఎవరైనా నిజంగా ఔరా అనాల్సిందే. క‌ళ్లు క‌నిపించ‌క‌పోయినా పియానో ప్లే చేస్తూ రెహ‌మాన్‌ను అనుస‌రించింది. స‌హారా నిరెన్ మంచి గాయ‌ని, పియానిస్ట్‌.  ఈ పాప ఇప్పటి వరకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చి అబ్బుర పరిచింది. అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది.   కోబ్రా మూవీ నుంచి ఏఆర్‌రెహ‌మాన్‌ స్వరపరిచారు' అనే శీర్షికతో స‌హారా ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

 

ఈమె టాలెంట్‌కు రెహ‌మాన్ అబినంధ‌న‌లు తెలుపుతూ 'స్వీట్' అనే క్యాప్ష‌న్ జోడించి రీట్వీట్ చేశారు. స‌హారా నైపుణ్యానికి అంద‌రూ ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.  'అమేజింగ్' అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.  నిజమే ఎవరికైనా మనసు ఉండాలి.. చేయాలన్న తపన ఉండాలి.  స‌హారా నిరెన్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: