టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అంటే పూజా హెగ్డే .. రష్మిక మందన్న.. కీర్తి సురేష్. ఇప్పుడు ఈ ముగ్గురు కెరీర్ పరంగా మంచి ఫాం లో ఉన్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలోనూ అఖిల్ కి జంటగా నటిస్తుంది. అలాగే ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో రూపొందబోయో సినిమాలోను పూజా హెగ్డే నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో రెండు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తుంది.

 

IHG

ఆ తర్వాత టాలీవుడ్ వరసగా సినిమాలు చేస్తూ అటు కోలీవుడ్ లోనూ బిజీగా ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్. రీసెంట్ గా పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ కి ఆ సినిమా నటిగా మంచి పేరు తెచ్చినప్పటికి సినిమా పరంగా డైవైడ్ టాక్ వచ్చింది. ఆ ప్రభావం కాస్త ఇప్పుడు రాబోయో సినిమాల మీదపడిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ కి సిద్దమవుతున్న మిస్ ఇండియా కూడా ఓటీటీలో రిలీజ్ అవతుందని అంటున్నారు. ఇక గుడ్ లక్ సఖీ తో పాటు నితిన్ సరసన రంగ్ దే సినిమాలో నటిస్తుంది.

 

IHG

అలాగే మరో సినిమాలో కూడా నితిన్ అవకాశం ఇచ్చాడని అంటున్నారు. వీటితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయో సర్కారు వారి పాట లో కూడా కీర్తి సురేష్ నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే లో కూడా నటిస్తుంది కీర్తి సురేష్. ఇలా వరసగా సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ కి ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.

 

IHG

ఇక కన్నడ బ్యూటి రష్మిక మందన్న... టాలీవుడ్ లో మరో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. సరిలేరు నీకెవ్వరు .. బీష్మ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సూపర్ హిట్స్ అందుకొని లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమాగా అయిదు భాషల్లో రూపొందుతున్న పుష్ప లో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు తమిళంలో కార్తి, విజయ్ సినిమాలలో అవకాశాలు అందుకుంది. అయితే ఈ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ కెరీర్ కి కరోనా గట్టి దెబ్బ కొట్టింది.

 

IHG

ఈ ముగ్గురికి రెండు కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ ఉండగా ఇప్పుడు అది భారీగానే కోత పడిందట. కీర్తి సురేష్ అయితే పరిస్థితులని అర్థం చేసుకొని తనంతట తానే తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంది. లేదంటే తెలుగు తమిళంలో వీళ్ళ రేంజ్ ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: