ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఊపు మీద సూపర్ ఫాం లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్. ఈ ఇయర్ ప్రారంభంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ ఆల్బం ఇచ్చి ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో నిలబడ్డాడు. చెప్పాలంటే గత సంవత్సరం నుండి మోత మోగుతున్న సాంగ్స్ అంటే అల ఆల్బం అనే చెప్పాలి. ఈ సినిమాలో థమన్ కంపోజ్ చేసిన ప్రతీ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఆడియో రిలీజ్ కి ముందే ఒక్కో సాంగ్ ని మేకింగ్ వీడియో ద్వారా జనాలలోకి తీసుకు వచ్చిన కొత్త ప్రయోగం అద్భుతంగా విజయవంతం అయింది. దాంతో థమన్ కి తిరుగు లేకుండా పోయింది. 

 

IHG's Samajavaragamana from Ala Vaikunthapurramuloo to release ...

చెప్పాలంటే ఈ సంవత్సరం ఎక్కువ సినిమాలు చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్. థమన్ చేస్తున్నన్ని సినిమాలు మరే మ్యూజిక్ డైరెక్టర్ చేయడం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన మగువా మగువా సాంగ్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అలాగే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ రోర్ కి థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.

 

IHG

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సర్కారువారి పాట కి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు. ముందునుంచి గోపీ సుందర్ ని అనుకున్న సర్కారు వారి పాట బృందం ఫైనల్ గా ఛాన్స్ మాత్రం థమన్ కి ఇచ్చారు. 7 ఏళ్ళ తర్వాత మహేష్ సినిమాకి అవకాశం రావడంతో అదిరిపోయో ఆల్బం ఇవ్వడానికి థమన్ ఎంతో కసిగా ఉన్నాడట. ఇక ఎన్.టి.ఆర్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందబోయో సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని అంటున్నారు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు కమిటయి ఉన్నాడు. అయితే 2020 లో థమన్ దూకుడు కి ఖచ్చితంగా నాలుగైదు బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలనుకున్నాడు. కాని ఆ దూకుడుకి కరోనా బ్రేక్ వేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: