టాలీవుడ్ చిత్ర పరిశ్రమకే కాదు కరోనా మిగతా చిత్ర పరిశ్రమలని ముంచేసింది. చిన్న సినిమా నుండి పెద్ద హీరోల సినిమాల వరకు క్లాప్ బోర్డ్ కొట్టి మూడు నెలలు అవుతోంది. రీసెంట్ గా కొన్ని కరోనా నిబంధనలతో షూటింగ్ జరుపుకునేందుకు అనుమతులు వచ్చాయి. కాని ఏ ఒక్కరు సెట్స్ మీదకి వెళ్ళేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు. కొబ్బరికాయ కొట్టిన సినిమా నుండి 70-80 శాతం చిత్రీకరణ జరుపుకున్న సినిమాలు లాక్ డౌన్ లో చాలానే ఉన్నాయి. అదుగో ఇదుగో అంటున్నారు తప్ప ఇప్పటి వరకు స్టార్ హీరోలెవరు ఇళ్ళలో నుంచి కదిలింది లేదు.

 

IHG

ఇక ముఖ్యంగా కరోనా నిబంధనలలో 60 ఏళ్ళు పైబడిన హీరోలకి చిత్రీకరణలో పాల్గొనే అవకాశం లేదట. ఈ విషయం అనుమతులు ఇచ్చినప్పుడే స్పష్టం చేశారని అంటున్నారు. అలా అయితే ఖచ్చితంగా సీనియర్ స్టార్ హీరోలెవరు షూటింగ్ లో పాల్గొనరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ లెక్కన ఈ సీనియర్ స్టార్స్ నటిస్తున్న సినిమాలు ఇప్పట్లో మొదలవవు సరి కదా ..రిలీజ్ కూడా ఎప్పుడవుతాయో చెప్పలేని పరిస్థితి.

 

IHG

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో ఆచార్య మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఒప్పుకున్నాక దాదాపు రెండేళ్ళు స్ట్రక్ అయ్యాడు కొరటాల. ఎట్టకేలకి ప్రాజెక్ట్ మొదలైందనుకుంటే ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా చిరంజీవి షూటింగ్ కి రానటువంటి పరిస్థితి అని అంటున్నారు. అందుకు కారణం చిరంజీవి వయసు 60 కి పైబడటమే. ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇప్పట్లో సెట్ లోకి అడుగుపెట్టలేరు. ఆయన వయసు కూడా 70 కి దగ్గర్లో ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్తే లో నటిస్తున్నారు.

 

IHG

ఇక నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతుంది. మిర్యాల రవీందెర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా బాలయ్య బోయపాటి ల హ్యాట్రిక్ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్ సంచలనం సృష్ఠించింది. అయితే బాలయ్య కూడా రీసెంట్ గా 60 వ వసంతంలోకి అడుగుబెట్టారు. అంటే ఆయన కూడా షూటింగ్ లో పాల్గొనడం కష్టమే అనమాట. ఇక అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అన్న సినిమా చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాని నాగార్జున కూడా కష్టమే. ఆయన వయసు 60 ఏళ్ళు.

 

IHG

ఇక మరో సీనియర్ స్టార్ హీరో లోకనాయకుడు కమల్ హాసన్. ఈ సీనియర్ హీరో ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 లో నటిస్తున్నాడు. ఇండియన్ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పుడు కమల్ ఏజ్ కూడా 60 ప్లస్. అంటే కమల్ కి నో ఛాన్స్. ఈ లెక్కన టాలీవుడ్ లో షూటింగ్ లో పాల్గొనే అవకాశం సీనియర్ హీరోలలో ఒక్క విక్టరీ వెంకటేష్ కి మాత్రమే ఉంది. ప్రస్తుతం వెంకటేష్ నారప్ప లో నటిస్తున్నాడు. మొత్తానికి కరోనా 60 ప్లస్ సీనియర్ స్టార్స్ కి అడ్డుపడి గడ్డుకాలంలో పడేసిందనమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: