టాలీవుడ్ లో ఇప్పుడు తెరకెక్కబోయో సినిమాలన్ని భారీ బడ్జెట్ సినిమాలే. కనీసం 100 కోట్ల బడ్జెట్ కి తగ్గడం లేదు. ఇక ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలైతే దాదాపు 300 కోట్ల కి పైగానే బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా చిత్ర పరిశ్రమలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో థియోటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో మేకర్స్ ఒక అంచనాకి రాలేకపోతున్నారు. ఇప్పటికే షూటింగ్స్ ఆగిపోయి, థియోటర్స్ మూత పడి 3 నెలలు దాటుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు ప్రతీ నిర్మాత మీద గట్టిగా పడింది అని విశ్లేషకులు అంటున్నారు.

 

IHG

 

ప్రస్తుతం రాజమౌళి .. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో ఆర్.ఆర్.ఆర్ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య 350 కోట్ల కి పైనే బడ్జెట్ ని కేటాయించి నిర్మిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ కావాల్సింది. కాని 2021 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులో 2021 సంక్రాంతికి రిలీజ్ కావడం కష్టమని అంటున్నారు. అదీ కాక ఇప్పటికే బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువ అవుతుందని నిర్మాత టెన్షన్ పడుతున్నారని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.

 

IHG

ఇక చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య కూడా పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా అనుకున్న ప్రకారం చిత్రీకరణ జరగడం లేదు. ఈ సినిమా కూడా ఈ ఇయర్ లో రిలీజ్ అనుకున్నప్పటికి అది కూడా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. ఇది కూడా నిర్మాలకి దెబ్బే. అలాగే దిల్ రాజు నిర్మిస్తున్న వకీల్ సాబ్ కి బాగానే ఖర్చు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా... దానికి తోడు పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడం దిల్ రాజు కల కాబట్టి బాగానే పెట్టాడు. అయితే ఇపుడు దిల్ రాజు కూడా ఆర్ధికంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడట. 

 

IHG

 

ఇక అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలన్ని అర్థాంతరంగా నిలిచిపోయాయి. అంతేకాదు మరో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా తన బ్యానర్ లో నారప్ప, విరాట పర్వం తో పాటు మరొకొన్ని సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నారప్ప, విరాట పర్వం సినిమాలనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. గుణశేఖర్ తో కలిసి నిర్మిస్తున్న హిరణ్య కశిప ని ఆపేశారు. 2022 లో మళ్ళీ నిర్మిస్తారట. 120 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని అనుకున్న ఈ సినిమాకి ఇప్పటికే 10 కోట్లు ఖర్చు చేశారు.

 

IHG

అయితే టాలీవుడ్ లో ఇలా భారీ బడ్జెట్ సినిమాలతో పాటు మరికొన్ని చిన్న..మీడియం బడ్జెట్ సినిమాలు అండర్ ప్రొడక్షన్స్ లో ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అవన్ని నిర్మిస్తున్న నిర్మాతలు ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారట. ముఖ్యంగా ఈ సంవత్సరం భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమా నిర్మాతలకి వాళ్ళు పెట్టిన పెట్టుబడి గల్లంతే అని ప్రత్యక్షంగానే కనిపిస్తోందని అంటున్నారు. ఇక ఇప్పటి నుంచైనా నిర్మాతలు జాగ్రత్త పడతారా లేదా చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: