బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజంపై నెటిజన్ల ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారలేదు. అలియా భట్, సొనాక్షి సిన్హా, కరణ్ జోహార్.. వంటి సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తగ్గిపోయారు. ఈనేపథ్యంలో అలియా భాట్ సోషల్ మీడియాపై మండిపడడం చర్చనీయాంశమైంది. ఇటివల జరుగుతున్న పరిణామాలు.. సోషల్ మీడియాపై  తన అభిప్రాయాన్ని ఇన్ స్టా అకౌంట్ లో కుండబద్దలు కొట్టింది. ఇందుకు ఓ కారణాన్ని చెప్పుకొచ్చింది. ఆస్కార్ జ్యూరీ నుంచి అలియా భట్ కు ఆహ్వానం అందింది. దీనిని ఊటంకిస్తూ ఆమె సోషల్ మీడియా తీరును దూనమాడింది.

IHG

 

అలియాకు ఆహ్వానం రావడంపై కూడా సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్లు వచ్చాయి. దీంతో ఆమె స్పందించింది. ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నన్ను అకాడమీలో సభ్యురాలిగా ఉండమంటూ ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు. ప్రతి ఏటా ఇండియా నుంచి మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ ను ఆహ్వానించడం శుభపరిణామం. సినిమా, నీరు ఒకటే. నీరు అందరికీ అవసరం.. బేధాల్లేకుండా కలసిపోతుంది.. ఎక్కడికైనా వెళ్తుంది. సినిమా కూడా అంతే. అందరికీ చేరువవుతుంది. ఆడియన్స్ కు నచ్చుతుంది.. క్రిటిక్స్ విమర్శలు చేస్తారు.. యూత్ ప్రేమ చూపిస్తారు. సినిమాపై  అభిప్రాయాలు వేరైనా మనందరినీ కలుపుతుంది‘.

IHG

 

‘కానీ.. ఇంతటి అనుబంధాన్ని సోషల్ మీడియా మాత్రం వేరు చేస్తోంది. ప్రజలందరినీ ఒక వేదిక పైకి తీసుకొచ్చి కలపకపోగా మనల్ని విభజించే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో మనల్ని కలిపేది సినిమా మాత్రమే’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఇటివలి సంఘటనల్లో సోషల్ మీడియా వేదకగా తనపై వస్తున్న విమర్శలకు ఇలా సమధానం ఇచ్చింది అలియా. ఈ మెసేజ్ లో తన ఆవేదన కూడా కనిపిస్తోందనే చెప్పాలి. సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఆస్థాయిలో ఆమె ట్రోలింగ్ కు గురైంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

💛 #wearetheacademy

A post shared by alia bhatt ☀️ (@aliaabhatt) on

మరింత సమాచారం తెలుసుకోండి: