రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత భారీ చిత్రం ఆర్.ఆర్.ఆర్ పై జనాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నాడు. 1920 ప్రాంతంలో జరిగిన కథగా వస్తున్న ఈ సినిమా పూర్తి కల్పితంగా ఉండనుంది. అయితే నిజజీవిత పాత్రలని తీసుకుని కల్పిత కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఎలా కలుసుకున్నారనేది ఆసక్తిగా ఉండనుంది.

 

నిజానికి వాళ్ళిద్దరూ కలుసుకున్నట్లు ఆధారాలు లేవు. అందువల్ల ఈ అంశం చాలా ఆసక్తిగా ఉండనుంది. అయితే మొదట ఈ సినిమాని 2020 జులై 30వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే. అనుకున్న సమయానికి విడుదల చేయడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. అదీగాక ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే ఆ మాత్రం ఆలస్యం అవుతుంది.

 

అందువల్ల రాజమౌళి విడుదల తేదీనీ వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీన విడుదల చేస్తానని చెప్పాడు. ఈ మేరకు ప్లాన్స్ కూడా జరిగిపోయాయి. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని  చెబుతారు కదా.. కరోనా రూపంలో రాజమౌళి ప్లాన్స్ కి బ్రేక్ పడింది. ఇప్పటికే షూటింగ్ కి మూడు నెలలు గ్యాప్ వచ్చింది. కరోనా ఉధృతి ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో మరెన్ని రోజులు ఇలాగే ఉంటుందో తెలియదు.

 

అందువల్ల రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ని వచ్చే సంవత్సరం జులై 30వ తేదీకి ఫిక్స్ అవుతున్నాడని అంటున్నారు. జులై అయితే ఇంకా చాలా టైమ్ ఉన్నందున ఇప్పుడప్పుడే టెన్షన్ పడిపోవాల్సిన అవసరం ఉండదు. అదీగాక రాజమౌళి చాలా చిత్రాలు జులైలో రిలీజ్ అయ్యాయి. మరి జులై 30 కే ఫిక్స్ అవుతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: