బాలకృష్ణ బోయపాటిల కాంబినేషన్ లో మూడవసారి హ్యాట్రిక్ కొడదాము అని బోయపాటి శ్రీను చేస్తున్న ప్రయత్నానికి అనేక పరిస్థితులు అడ్డు తగులుతున్నాయి. లాక్ డౌన్ ప్రారంభం ముందు మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇప్పటి కరోనా పరిస్థితులు వల్ల ఆగిపోవడంతో ఎప్పటికి మళ్ళీ మొదలవుతుందో బోయపాటికి కూడ తెలియని పరిస్థితి.


అయితే ఈమధ్య బాలకృష్ణ పుట్టినరోజునాడు విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు అనూహ్యమైన స్పందన రావడంతో తిరిగి ఈ మూవీ పై బోయపాటికి విపరీతమైన ఉత్సాహం కల్గింది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి ఏర్పడ్డ హీరోయిన్ కష్టాలు తొలగించాలని బోయపాటి తమిళ బ్యూటీ అమలాపాల్ తో రాయబారాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


వాస్తవానికి అమలాపాల్ తెలుగు గిలిం ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ అయినప్పటికీ ఆమె ఇప్పటి వరకు అల్లు అర్జున్ రామ్ చరణ్ నాని లాంటి యంగ్ హీరోలతో నటించింది. ప్రస్తుతం ఆమెకు కోలీవుడ్ లో మంచి పేరుతో పాటు చాల అవకాశాలు కూడ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో బాలకృష్ణతో నటించే విషయంలో వచ్చిన బోయపాటి ఆఫర్ పై ఆలోచించుకోవడానికి సమయం కావాలని అడిగినట్లు టాక్. పాత్ర నచ్చితే చాలు టాప్ హీరోయిన్స్ లా  పారితోషికం విషయంలో పెద్దగా ఆమె పట్టించుకోదు. అయితే ఆమె ఇప్పటి వరకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు ఎవరితోనూ ఆమె నటించలేదు. 


ఇలాంటి పరిస్థితులలో బాలయ్యతో నటించే విషయంలో తనకు వచ్చిన ఆఫర్లు ఒప్పుకోవడం మంచిదా కాదా అన్న విషంలో అమలా పాల్ కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు టాక్. వాస్తవానికి ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు అంజలి పేరును బోయపాటి పరిసీలిమ్చినప్పటికీ ఆమెకంటే అమ్లాపాల్ ఈ మూవీ ప్రాజెక్ట్ లో కొనసాగితే మార్కెట్ పరంగా కూడ ఈ మూవీకి క్రేజ్ ఏర్పడుతుంది అని బోయపాటి చేస్తున్న రాయబారాలకు అమలా పాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: