కళ్యాణ్ రామ్ కి తన జీవితంలో తాత, తండ్రి తర్వాత ఎక్కువగా తన భార్య స్వాతి అంటే మిక్కిలి ఇష్టం. అందుకే ఆమె పేరుని తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు కళ్యాణ్ రామ్. ఒకరోజు శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ నటించిన శతమానం భవతి సినిమా చూసిన స్వాతి... మీరు ఎందుకండి ఇటువంటి సినిమాలు తీయలేక పోతున్నారని, ఎప్పుడు చూసినా కొట్టుకు చచ్చే హింసాత్మక సినిమాలు ఎందుకు తీస్తారు? అని కళ్యాణ్ రామ్ ని అడిగింది. దీంతో అతడు ఇక మీదట కేవలం కుటుంబ భరిత సినిమాలను మాత్రమే తీస్తానని తన భార్యకు మాట ఇచ్చాడట. అందుకే శతమానం భవతి సినిమా దర్శకుడు సతీష్ విగ్నేశా తో కలిసి ఎంత మంచి వాడవురా సినిమాని తెరకెక్కించాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది.


స్వాతి తమ్ముడైన హరి కళ్యాణ్ రామ్ నటించిన ప్రతి సినిమా చూసి మొట్టమొదటిగా తానే ఏ మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా రివ్యూ చెప్పేవాడట. కళ్యాణ్ రామ్, స్వాతి 2006 ఆగస్టు 10వ తేదీన అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పద్నాలుగేళ్ల వైవాహిక బంధంలో ఒక కుమారుడు ఒక కుమార్తె జన్మించారు. కుమార్తె పేరు తారక అద్విత కాగా... కుమారుడి పేరు సౌర్య రామ్. నిజానికి కళ్యాణ్ రామ్ స్వాతి ల పెళ్లిని పెద్దలు కుదిర్చారు. ఎన్నో పరిశ్రమలు, వందల కోట్ల ఆస్తి ఉన్న స్వాతి తమ తల్లిదండ్రుల కోరిక మేరకు ఎంబీబీఎస్ చదువు పూర్తిచేసి పెద్ద వైద్యురాలు అయ్యింది.


ఐతే మొదటిసారిగా పెళ్లి చూపుల్లో ఆమెను చూసిన కళ్యాణ్ రామ్ వెంటనే మనసు పారేసుకున్నాడు. తన మనసులో ఆమెనే భార్యగా నిశ్చయించుకున్నాడు. పెళ్లికాకముందు కళ్యాణ్ రామ్ ఆడవాళ్ళకి చాలా దూరంగా ఉంటూ ఎవరితోనూ కలిసి పోలేక చాలా భయంగా మాట్లాడేవాడు. కానీ తన భార్య అతడి ప్రవర్తన మొత్తం మార్చేసి అందరితో కలిసిపోయేలా చేసిందని కళ్యాణ్ రామ్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్వాతి వైద్య రంగానికి దూరంగా ఉంటూ భర్త పిల్లలను చూసుకుంటూ అడపాదడపా గ్రాఫిక్ పరిశ్రమని నడుపుతూ ఉంటుంది. ఏది ఏమైనా మనస్ఫూర్తిగా మాట్లాడుతూ, ఎటువంటి కల్మషం లేకుండా అందరినీ మంచిగా చూసుకునే కళ్యాణ్ రామ్ వంటి మంచి భర్త దొరికినందుకు స్వాతి ఎంతో సంతోష పడుతుంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: