నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ ఈరోజు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ ప్రత్యేకమైన రోజున అతడు తన తమ్ముడైన ఎన్టీఆర్ తో ఎలా ఉంటాడో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. నందమూరి వంశం లో అతి పెద్ద చదువు చదివిన కళ్యాణ్ రామ్ సినిమాలో హీరో అవ్వాలన్న ఆశతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసి అతనొక్కడే వంటి హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ప్రసాదించాడు. ఆ తర్వాత హరేరామ్, జయీభవ వంటి సినిమాలను తీశాడు కానీ అవన్నీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో తీవ్ర నిరాశలో మునిగిపోయిన కళ్యాణ్ రామ్ కి ఒక షాకింగ్ విషయం తెలిసిందే. అదేంటంటే తన తమ్ముడు తారక్ కి రోడ్డు ప్రమాదం జరిగిందని. ఈ విషయం తెలియగానే కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి అతడిని పరామర్శించి మొట్టమొదటిసారిగా మంచిగా మాట్లాడాడు.


ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన తమ్ముడిని తన తండ్రిని నిర్లక్ష్యం చేయడంతో కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ బాగా దగ్గరయ్యారు. ఈ సమయంలోనే తనకి కేవలం అట్టర్ ప్లాప్ సినిమాలు మాత్రమే ఇచ్చిన డైరెక్టర్ మల్లికార్జున్ తో మళ్ళీ కలిసి కళ్యాణ్ రామ్ కత్తి సినిమాని తెరకెక్కించి మరొక డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తదనంతరం 2011వ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహానికి విచ్చేసిన కళ్యాణ్ రామ్ తారక తో ఎంతో ఆప్యాయతగా మాట్లాడి తమ అన్నదమ్ముల అనుబంధాన్ని దృఢ పరిచాడు. వివాహం అనంతరం వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే హాలీవుడ్ సినిమా తెరకెక్కించిన అవతార్ క్రూ తో కలసి రెండు సంవత్సరాలపాటు ఎంతో శ్రమించి రూ. 23 కోట్ల బడ్జెట్ తో ఓం 3డి చిత్రాన్ని తెరకెక్కించాడు కానీ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించలేదు. తాము పడ్డ శ్రమంతా వృధా అయినప్పటికీ భారతదేశంలో మొట్టమొదటిగా 3డి చిత్రాన్ని రూపొందించిన పేరు అయినా మిగిలిందని కళ్యాణ్ రామ్ కాస్త సంతోషపడ్డాడు.


కొన్ని రోజుల తర్వాత జానకిరామ్ అకాల మరణం చెందడం తో తారక్, కళ్యాణ్ రామ్ కలిసి వెళ్లి తమ అన్నయ్యను చూసి బాగా కుమిలిపోయారు. బాధను పంచుకునేందుకు లక్ష్మీ,  శాలినిదేవి కూడా ఈ సంఘటనతో పూర్తిగా ఒకటై పోయారు.  కొన్ని సంవత్సరాల తర్వాత కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా, తారక్ టెంపర్ సినిమా ఓకేసారి బ్లాక్ బాస్టర్ హిట్స్ కావడంతో తండ్రి హరికృష్ణ ఎంతో సంతోషపడ్డాడు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోవడంతో తారక్, కళ్యాణ్ రామ్ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఈ సమయంలో ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. కళ్యాణ్ రామ్ తారక్ లోనే తన తండ్రిని చూసుకుంటాడు. అందుకే తన తమ్ముడిని ఎప్పుడూ నాన్న అని పిలుస్తున్నాడు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: