తమిళ్ సినిమాలో సూపర్ స్టార్ డమ్ తో దూసుకుపోతున్న హీరో విజయ్. ఇంకా చెప్పాలంటే సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్ ను టచ్ చేస్తున్నాడు. విజయ్ సాధిస్తున్న వరుస హిట్లు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. ఇంతటి స్టార్ ఇమేజ్, సక్సెస్ రేట్, ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్ పై తమిళ సీనియర్ నటుడు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో.. ‘విజయ్ సినిమాలు చూడటం మానేశాను. భవిష్యత్తులో కూడా విజయ్ సినిమాలో నటించను’ అంటూ ఖరాఖండీగా చెప్పేశాడు. ఇందుకు కారణం కూడా చెప్పుకొచ్చాడు.

IHG

 

తెలుగు పోకిరి తమిళ రీమేక్ పొక్కిరి సినిమాలో విజయ్ తో కలిసి నెపోలియన్ కలసి నటించాడు. ఆ సినిమా సమయంలో తమిద్దరి మధ్య జరిగిన వాగ్యుద్దమే ఇందుకు కారణమంటున్నాడు నెపోలియన్. ‘ఆ సినిమా షూటింగ్ సమయంలో నా ఫ్రెండ్స్ కొంతమంది విజయ్ కలవాలని వచ్చారు. షూటింగ్ స్పాట్ లో విజయ్ క్యారవాన్ లో రెస్ట్ లో ఉన్నాడు. నేను క్యారవాన్ దగ్గరకు వాళ్లని తీసుకెళ్లినప్పుడు అక్కడి విజయ్ పర్సనల్ సిబ్బందితో ఘర్షణ జరిగింది. బయట అలికిడితో విజయ్ క్యారవాన్ నుంచి వచ్చాడు. పరిస్థితి చూసి నాతోనే వాదించాడు. ఇది మ్యానర్స్ కాదు అని. ఆ సమయంలో ఇద్దరి మధ్యా వాదన జరిగింది’ అంటూ గతాన్ని చెప్పుకొచ్చాడు.

IHG

 

ఆరోజు తీసుకున్న డెసిషన్ తో ఇప్పటివరకూ విజయ్ సినిమా ఏదీ చూడలేదు.. నటించలేదని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకూ తనకు మరో సూపర్ స్టార్ అజిత్ తో నటించే అవకాశం రాలేదని.. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. నాగార్జునతో హలో బ్రదర్, మోహన్ బాబు నిర్మించిన రాయలసీమ రామన్నచౌదరి, సలీమ్.. సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు నెపోలియన్. ప్రస్తుతం నెపోలియన్ వ్యాఖ్యలు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: