ముందుగా 2003లో వచ్చిన ఐదో తారీఖు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా అడుగుపెట్టిన యువ హీరో శర్వానంద్, ఆ తరువాత యువసేన, గౌరీ, శంకర దాదా ఎమ్బిబిఎస్ సినిమాల్లో మంచి పాత్రలు చేసాడు. అనంతరం విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సంక్రాంతి సినిమాలో ఆయన తమ్ముడిగా ఒక ముఖ్యపాత్రలో నటించి మంచి పేరు దక్కించుకున్నాడు శర్వా. ఆపై అక్కడక్కడా సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటిస్తూ ముందుకు సాగిన శర్వానంద్, సరిగ్గా 2008లో క్రిష్ తీసిన గమ్యంలో మెయిన్ రోల్ లో నటించి, ఆపై 2010లో దేవాకట్టా దర్శకత్వంలో సాయికుమార్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ప్రస్థానం సినిమాలో ఆకట్టుకునే పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. 

IHG

ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు నటుడిగా శర్వానంద్ కు బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలతో దూసుకెళ్లిన శర్వానంద్, మధ్యలో హీరోగా మంచి హిట్స్ అందుకోవడంతో పాటు ఆడియన్స్ లో క్రేజ్, ఫాలోయింగ్ ని కూడా సంపాదించాడు. మొదటి నుండి కూడా తాను ఎంచుకునే పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి నటించే అలవాటున్న శర్వానంద్, సినిమా ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా నేడు టాలీవుడ్ లో మంచి పేరున్న హీరోగా మంచి అవకాశాలతో కొనసాగుతున్నాడు. 

 

మధ్యలో ఆయనకు కొంత కెరీర్ పరంగా కొంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా, ఏ మాత్రం కృంగిపోకుండా ఆపై తన టాలెంట్ ని నమ్ముకుని ముందుకు నడిచాడు. నాలుగేళ్ళ క్రితం వచ్చిన శతమానంభవతి సినిమా యువత తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా శర్వాకు బాగా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీకారం సినిమాలో హీరోగా నటిస్తున్న శర్వానంద్, రిలీజ్ తరువాత ఆ సినిమాతో కూడా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: