సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ చేసే సురేఖా వాణి హౌస్ వైఫ్ పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తుంది. అక్క, చెల్లి, వదిన, అత్తయ్య, అమ్మ ఇలా తను చేయని పాత్ర లేదని చెప్పాలి. ఈమధ్యనే తన భర్తను పోగొట్టుకున్న సురేఖా వాణి ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటకు వచ్చినట్టు ఉంది. ఇక కూతురిని హీరోయిన్ గా చేసే ఆలోచనలో ఉన్న ఆమె ఇప్పటినుండే ట్రైనింగ్ ఇస్తుందని తెలుస్తుంది. సురేఖా వాణి తనయ సుప్రితతో కలిసి దిగే లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ గా మారుతాయి.

 

లేటెస్ట్ గా బ్లాక్ అండ్ బ్లాక్ లో తల్లికూతుర్ళ్లిద్దరు మెరిసారు. తనకు ఛాన్సులు వచ్చినా రాకపోయినా తన కూతుర్ని మాత్రం హీరోయిన్ గా చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది సురేఖా అందుకే ఆమెను బాగా ప్రమోట్ చేస్తుంది. వారనికో ఫోటో షూట్ తో దర్శక నిర్మాతల దృష్టిలో పడేలా చేస్తుంది. సురేఖా వాణి పరిచయాలతో సుప్రితకు ఛాన్స్ ఇప్పించడం కష్టమేమి కాదు సుప్రిత కూడా చూడటానికి అందంగా ఉంది. అయితే అందాల ప్రదర్శన ఎవరైనా చేస్తారు. యాక్టింగ్ టాలెంట్ ఎంతవరకు ఉందో చూడాలి.

 

భర్త మరణించిన తర్వాత సినిమాలకు కొద్దిపాటి బ్రేక్ ఇచ్చిన సురేఖా వాణి మళ్లీ తిరిగి సినిమాలు చేయాలని చూస్తుందట. ఇప్పటికే దర్శక నిర్మాతలకు తాను కూడా సినిమాలకు సిద్ధమే అని మెసేజ్ పాస్ చేసిందట. ఓ పక్క కూతురు హీరోయిన్ గా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టిందట. పెద్ద ప్రొడక్షన్ ద్వారానే కూతురు ఎంట్రీ ఉందేలా ప్లాన్ చేస్తుంది సురేఖా వాణి. అందుకే ఆడియెన్స్ లో ఆమెకు ముందుగానే ఓ ఐడెంటిటీ ఏర్పడేలా ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.  త్వరలోనే సుప్రిత హీరోయిన్ గా బిగ్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.     

 

మరింత సమాచారం తెలుసుకోండి: