పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ మరో రెండు సినిమాలని కూడా ఒప్పుకున్నాడు. అయితే వకీల్ సాబ్ చిత్రం బాలీవుడ్ పింక్ సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తా అనుకున్నప్పుడు పింక్ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందని దర్శకుడు త్రివిక్రమ్ సలహా ఇచ్చాడట. రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్సినిమా చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ చెప్పాడట.

 

అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా గురించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ వీరి కాంబినేషన్లో మూడు సినిమాలు తెరకెక్కాయి. అందువల్ల వీరి కాంబినేషన్ పై అందరికీ ఆసక్తి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే అందులో చరణ్ హీరోగా నటించనున్నాడట. రామ్ చరణ్ ఇప్పటి వరకు త్రివిక్రమ్ తో సినిమా చేయలేదు.

 

రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ఎప్పటి నుండో చర్చ జరుగుతుంది. కానీ పరిస్థితులు కలిసి రాక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్, చరణ్ కోసం కథ రాస్తున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ కి కథ పూర్తి చేసిన త్రివిక్రమ్, చరణ్ కోసం కథ రాసే పనిలో ఉన్నాడట. అయితే ఈ సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మించనున్నాడట. పవన్ నిర్మాతగా చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం ఉండనుందన్నమాట.

 

అయితే గత కొన్నేళ్ళుగా త్రివిక్రమ్ సినిమాలకి హారికా హాసినీ క్రియేషన్స్ వారు నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మరి చరణ్ హీరోగా రూపొందే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తో పాటు వీరు కూడా భాగస్వామిగా ఉంటారా అన్నది సందేహం. మరి భవిష్యత్తులో ఏం జరగనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: