మారిన దిల్ రాజ్ షాక్ అయిన ఇండస్ట్రీ వర్గాలు !


టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే ఆనలుగురిలో ఒకరైన దిల్ రాజ్ టాప్ హీరోలతో సినిమాలు తీసేవిషయంలో ఖర్చుకు ఎప్పుడు వెనకాడడు. ఒక కథ వినగానే ఆకథ ఎంతవరకు సినిమాకు ఉపయోగపడుతుంది అన్న అంచనాలు వేయడంతో దిట్ట అయిన దిల్ రాజ్ టాలెంట్ ఉన్న హీరోలను దర్శకులను ప్రోత్సహించడంలో చాలముందు వరసలో ఉంటాడు. అలాంటి దిల్ రాజ్ కు కొంతకాలం క్రితం ఒక దురదృష్ట సంఘటన జరిగి అతడి భార్య చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే.


అయితే ఆ దురదృష్ట సంఘటన నుండి దిల్ రాజ్ కొంత కాలానికి తెరుకోవడమే కాకుండా వేగంగా సినిమాలు తీస్తూ ఈమధ్యనే ఈ లాక్ డౌన్ సమయంలో మరో పెళ్ళి కూడ చేసుకున్నాడు. ఈ పెళ్ళి తరువాత దిల్ రాజ్ మరింత హుషారుగా మారడమే కాకుండా తన సినిమాలకు సంబంధించి మరింత వేగాన్ని పెంచాడు. ఇటీవల దిల్ రాజ్ సతీసమేతంగా తిరుమల సందర్శించినప్పుడు ఆయన లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.


ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కూడ లేకపోవడంతో ఎప్పుడు ఇంటిపట్టునే ఉంటూ ఉండటంతో ఆయన లుక్ లో మార్పు వచ్చిందా అంటూ కొందరు కామెంట్స్ కూడ చేసుకున్నారు. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా దిల్ రాజ్ తన ఫిజికల్ ఫిట్నెస్ మీద కేర్ తీసుకునే కార్యక్రమాల పై చాల శ్రద్ధ తీసుకుంటున్నాడని టాక్. దీనికోసం రెగ్యులర్ గా జిమ్ సెషన్ లో పాల్గొనడంతో పాటు తన భార్యతో కలిసి బ్యాడ్మింటన్ కూడ ఆడుతున్నాడట. దిల్ రాజు బ్యాడ్మింటన్ సెషన్ తర్వాత తన భార్యతో కలిసి ఒక ఫోటోను ఇప్పుడు కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసారు.


ఈఫోటో షేర్ అయిన కొన్ని గంటలలోనే ఒక టాప్ హీరోలో లేటెస్ట్ లుక్ ను చూసి ఆశ్చర్యపోయినట్లుగా అందరు ఈఫోటోను ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. కొందరైతే ఈ ఫోటోను చూసిన తరువాత దిల్ రాజ్ ఎలాగు స్లిమ్ గా తయారవుతున్నాడు కాబట్టి రానున్న రోజులలో తానే హీరోగా మారే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అంటూ కామెంట్స్ కూడ చేస్తున్నారు. అందుకే కాబోలు గతంలో నాని ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరదాగా జోక్ చేస్తూ తాను ఈ సంవత్సరం ప్రారంభం అయినప్పుడు కరోనాని అదేవిధంగా దిల్ రాజ్ పెళ్లిని ఊహించుకోలేకపోయాను అన్ని అద్భుతాలే అంటూ జోక్ చేసాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: