రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో కొమరం భీమ్ గా కనిపించనున్న ఎన్టీఆర్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపిస్తుంటే కొమరం భీమ్ ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. నిజజీవిత పాత్రలైన వీరిద్దరూ నిజంగా కలుసుకున్నట్లు ఎక్కడా లేదు.

 

కానీ వీరిద్దరి జీవితాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. 1920 ప్రాంతంలో వీరిద్దరూ ఇళ్లనుండి పారిపోయారట. మళ్లీ కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చి, ఆంధ్రాప్రాంతంలో అల్లూరి సీతారామరాజు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడితే, తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబుకి వ్యతిరేకంగా కొమరం భీమ్ పోరాడారు. అయితే ఈ కామన్ పాయింట్స్ ని తీసుకుని రాజమౌళి చాలా ఆసక్తికరంగా ఆర్.ఆర్.ఆర్ ని తెరకెక్కిస్తున్నాడు.

 

నిజజీవితంలో అసలు కలుసుకోలేని పాత్రలని రాజమౌళి తన సినిమాలో ఎలా కలిపాడన్నదే ఆసక్తికరం. కల్పిత కథగా రూపొందుతున్న ఈ సినిమా నుండి రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేసాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో అప్పటి నుండి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో చూడాలన్న తహతహ ఎక్కువైంది. ఎన్టీఆర్ పుట్టినరోజున ఆర్.ఆర్.ఆర్ నుండి ఎన్టీఆర్ లుక్ బయటకి వస్తుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RRR MOVIE' target='_blank' title='rrr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rrr</a> plagued with leaks

లాక్డౌన్ కారణంగా ఎన్టీఆర్ ఇంట్రో వీడియో ఫుటేజి లేకపోవడంతో అప్పుడు రిలీజ్ చేయలేదు. అయితే ప్రస్తుతం షూటింగ్స్ కి ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయి. కానీ అదే సమయంలో కరోనా వైరస్ విజృంభణ మరింత పెరిగింది. దానివల్ల ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా లేదు. సో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: