బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడవసారి హ్యాట్రిక్ హిట్ కొట్టాలి అన్న లక్ష్యంతో రాబోతున్న మూవీకి ‘మోనార్క్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు అన్నవార్తలు ఇప్పటి వరకు వచ్చాయి. ‘సింహా’ ‘లెజెండ్’ ల స్థాయిలో ‘మోనార్క్’ టైటిల్ ఉంటుంది అన్న ఆలోచనలలో బోయపాటి శ్రీను చెప్పిన ఈ టైటిల్ కు బాలకృష్ణ ఓకే చేసాడు అనే లీకులు కూడ వచ్చాయి.  


అయితే ఇప్పడు లేటెస్ట్ గా ఈసినిమాకు సంబంధించి మరో కొత్త టైటిల్  ప్రచారంలోకి వచ్చింది. ఈ మూవీలో బాలయ్య చాలపవర్ ఫుల్ రోల్ లో  కనిపిస్తాడు కాబట్టి ఈ సినిమాకు ‘సూపర్ మాన్’ అనే టైటిల్ ను పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కొత్తగా బోయపాటిలో ప్రారంభం అయినట్లు వార్తలు వస్తున్నాయి.  


అయితే ఈ టైటిల్ తో హాలీవుడ్ లో సినిమా రావడమే కాకుండా ‘సూపర్ మాన్’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందింది. దీనితో హాలీవుడ్ మేకర్స్ నుండి ఈ సూపర్ మాన్ టైటిల్ పై ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తాయా అన్న ఆలోచనలు కూడ బోయపాటిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ తో బాల్లయ్య సినిమా ఉంటే ఖచ్చితంగా మంచి స్పందన రావడమే కాకుండా మంచి ఓపెనింగ్స్ వస్తాయని బోయపాటి స్కెచ్.


ఇప్పటికే బాలకృష్ణ పుట్టిన రోజునాడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కు విపరీతమైన స్పందన రావడంతో ఇప్పడు ఈసినిమాకు హాలీవుడ్ టైటిల్ కూడ జతకడితే ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ అప్పుడే బాలయ్య అభిమానులు ఈటైటిల్ వార్తలు విని జోష్ లోకి వెళ్ళిపోతున్నారు. వస్తవానికి ఈ సినిమాను బాలయ్యకు కలిసివచ్చే సంక్రాంతి సెంటిమెంట్ రీత్యా పెద్ద పండుగకు విడుదలచేయాలని మొదట్లో భావించినా కారోనా సమస్యలు అడ్డు తగలడంతో ఈ మూవీ సంక్రాంతి రేస్ కు రావడం కష్టమే అని అంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: