హైదరాబాద్ నగరంలోని బేగంపేటలో జన్మించిన హీరో నిఖిల్ సిద్ధార్థ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. ముఫాఖం జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో తన బీటెక్ చదువును పూర్తి చేశాడు. హైదరాబాద్ నవాబ్స్ అనే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాలో రాజేష్ పాత్రలో నటించే బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కే ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఏకైక చిత్రంగా హ్యాపీడేస్ అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  నలుగురు బీటెక్ విద్యార్థులలో ఒకరిగా నటించిన రాజేష్ ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోగా ఎదగడం మెచ్చుకోదగ్గ విషయమే.


ఎందుకంటే మిగతా ముగ్గురు సహనటులు సినిమాల్లో హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి కనుమరుగయ్యారు. నిఖిల్ మాత్రం ఎంతో కష్టపడి మంచి వ్యక్తులను ఎంపిక చేసుకొని హీరోగా ఎదిగి తన పట్టుదల ఏంటో నిరూపించాడు. 2008, 2010 2011, 2012 సంవత్సరాల్లో నిఖిల్ నటించిన అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్, యువతా కళావర్ కింగ్ వీడు తేడా, ఓంశాంతి ఆలస్యం అమృతం వంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందలేదు కానీ 2013వ సంవత్సరంలో విడుదలైన స్వామిరారా ప్రేక్షకులను బాగా అలరించింది సూపర్ హిట్ గా నిలిచి అతని సినీ కెరీర్ని గాడిలో పెట్టింది.


ఆ తర్వాత వచ్చిన కార్తికేయ, శంకరాభరణం సూర్య వర్సెస్ సూర్య చిత్రాలు యావరేజ్ టాక్ తో సరిపెట్టుకోగా మళ్లీ 2016లో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు నిఖిల్. ఈ చిత్రంలో హారర్, కామెడీ, రొమాంటిక్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరించాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా ఒక సరికొత్త కథాంశం తో అద్భుతమైన మ్యూజిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే సరికి అది బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఆ తర్వాత డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన కేశవ సినిమా కూడా ప్రేక్షకులను బాగా అనిపించింది. 2018వ సంవత్సరంలో నిఖిల్ హీరోగా నటించిన కాలేజీ డ్రామా కిరాక్ పార్టీ కూడా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది.



Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: