పక్కింటి కుర్రాడు లా కనిపించే నాచురల్ స్టార్ నాని  ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి టాలీవుడ్ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని అసలు పేరు నవీన్ బాబు ఘంటా కాగా... చిన్నతనం నుండి అతను అని అందరూ నాని అని పిలిచేవారు. దీంతో అతని అసలు పేరు ఏంటో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. సినిమా పరిశ్రమలో ఆరంగేట్రం చేసిన తర్వాత కూడా తన ముద్దు పేరునే అసలు పేరు గా నాని ఉంచుకున్నాడు. హైదరాబాద్ నగరంలో వరల్డ్ స్పేస్ సాటిలైట్ లో రేడియో జాకీగా కొంతకాలం పని చేసి బాగా పాపులర్ అయ్యాడు.


నాన్ స్టాప్ నాని అనే ఒక రేడియో కార్యక్రమం పని చేసినట్టు ఎన్నో సందర్భాలలో నాని చెప్పుకొచ్చాడు. బాగా కష్టపడి ఫలితం దక్కుతుందనే ఆశతో అందరూ నిద్ర పోతే హీరో నాని మాత్రం ఈ రోజుకి ఎంత బాగా కష్టపడ్డామనే ఒక సంతృప్తితో సంతోషకరంగా నిద్రపోతాడట. దీన్ని బట్టి చూస్తుంటే కష్టపడటం తమ ధ్యేయంగా ఫలితాన్ని ఆశించకుండా ముందుకు వెళ్లే వ్యక్తిగా అర్థమవుతుంది. నాని కి డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఎప్పటినుంచో ఉండేదట. అతనికి మణిరత్నం అంటే చాలా ఇష్టం అంట అందుకే మణిరత్నం అంటే స్ఫూర్తిగా తీసుకొని సినీ పరిశ్రమలో దర్శకుడు అవ్వాలని నాని అనుకునేవాడు. ఈ కోరికతోనే బాపు వద్ద క్లాప్ బాయ్ చేరాడు. తదనంతరం సినీపరిశ్రమలో అరంగేట్రం చేసి బాపు, రాధా, గోపాలం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. మంచు విష్ణువర్ధన్ బాబు హీరోగా నటించిన ఢీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని పని చేసాడు.


నాని కి టాలీవుడ్ మహిళా దర్శకురాలు అయిన నందినీరెడ్డి మంచి స్నేహితురాలు. వాళ్ళిద్దరు ఎక్కువగా కలుస్తూ దర్శకత్వం గురించి స్క్రిప్ట్ ల గురించి మాట్లాడుకునేవారు. ఈ పరిచయంతోనే నాని ని అలా మొదలైంది సినిమాలో హీరో గా ఎంపిక చేసుకుంది నందినీరెడ్డి. నిజానికి అప్పటికే నాని మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న అష్టా చమ్మ సినిమాలో మరొక చిత్రమైన రైడ్ లో కూడా హీరోగా నటించాడు.  ఆ నమ్మకంతో నందినీరెడ్డి అతడిని అలా మొదలైంది సినిమాలో హీరోగా నటింపజేసింది. ఆ విధంగా తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా తెరంగేట్రం చేసిన నాని జెంటిల్ మెన్, కృష్ణార్జున యుద్ధం, భలే భలే మగాడివోయ్ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, ఈగ, నేను లోకల్ ఏం చేయమంటే హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను చూరగొన్నాడు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: