తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు రావు అన్నది ఒకప్పటి మాట. టాలెంట్ ఉంటే ఎక్కడివారైనా అవకాశాలు ఇచ్చేస్తారు అన్నది ఇప్పటిమాట. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ హవా కొనసాగుతుంది. అయితే ఆశించిన స్థాయిలో అన్నది చెప్పలేం కాని ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా బెటర్ అని చెప్పొచ్చు. దర్శక నిర్మాతలకు ముంబై మోడల్స్ మీద మోజు తగ్గిందని తెలుస్తుంది. మాట్లాడితే ముంబై నుండి మోడల్స్ ను దింపే దర్శక నిర్మాతలు పాత్రలకు తగినట్టుగా ఇక్కడ వారికి ఛాన్సులు ఇస్తున్నారు.

 

తెలుగులో ఈమధ్య కాలంలో క్లిక్ అయిన వారిలో తేజశ్వి మడివాడ ఒకరు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసిన తేజశ్వి ఆ తర్వాత చాలా పాపులర్ అయ్యింది. ఆర్జివి ఐస్ క్రీం తో కూడా అలరించిన ఈ అమ్మడు బిగ్ బాస్ 2తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. సాధారణంగా తెలుగు భామలు గ్లామర్ విషయంలో వెనకడుగు వేస్తారు. కాని తేజశ్వి అలా కాదు.. ఇక్కడ నెగ్గుకు రావాలంటే స్కిన్ షో తప్పనిసరి అని గుర్తించింది.. అందుకే అడిగిన దానికన్నా ఎక్కువ గ్లామర్ షో చేసేందుకు రెడీ అంటుంది.

 

లేటెస్ట్ గా ఆమె కమిట్మెంట్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా టైటిల్ తోనే కథ, కథనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. మీటూ, కాస్టింగ్ కౌచ్ లాంటి వాటిని బేస్ చేసుకుని తెరకెక్కించే ఈ కమిట్మెంట్ సినిమాలో తేజశ్వి అంతకుమించి అన్నట్టుగా పరువాలను గుమ్మరిస్తుంది. ఏం చేసినా సరే తనలా కమిట్మెంట్ తో చేయడం మరే తెలుగు అమ్మాయి వల్లా కాలేదని చెప్పొచ్చు. లెక్కకుమించి గ్లామర్ షో చేస్తున్నా అమ్మడికి రావాల్సిన క్రేజ్ మాత్రం రావట్లేదు. మరి కమిట్మెంట్ తో అయినా ఆమెకు అనుకునే రేంజ్ పొందుతుందో లేదో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: