శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా ఆనందంతో అందరి దృష్టిని ఆకర్షించిన హీరో ఆకాష్‌. ఆ హీరో అసలు పేరు సతీష్‌ నాగేశ్వరన్‌. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించాడు ఆకాష్‌. 1999లో రిలీజ్‌ అయిన రోజావనం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్‌. తరువాత రామోజీ రావు నిర్మించిన ఆనందం సినిమాతో తొలి బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఆకాష్ కెరీర్ మలుపు తిరిగినట్టే అని భావించారు.

 

ఆనందం సక్సెస్‌ కావటంతో తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. 2003లో ఆనందం రీమేక్‌తోనే తమిళ్‌లోనూ తొలి సక్సెస్‌ను అందుకున్నాడు. దీంతో ఆకాష్‌ హీరోగా స్టార్‌ ఇమేజ్‌ అందుకోవటం కాయం అని భావించారు. అంతేకాదు తమిళ్‌లో కేవలం రెండు సంవత్సరాల్లోనే ఆరు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాలేవి సక్సెస్‌ కాకపోవటంతో సపోర్టింగ్ రోల్స్‌కు మారిపోయాడు.

 

తెలుగులో అందాల రాముడు, నవ వసంతం, గోరింటాకు లాంటి సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అవకాశాలు తగ్గిపోవటంతోనే నిర్మాతగా దర్శకుడిగా మారి పలు చిత్రాలను రూపొందించాడు. ఆ సినిమాలు కూడా ఫ్లాప్‌ కావటంతో ఆకాష్‌కు ఆర్ధికంగా కూడా నష్టాలు వచ్చాయి. అయితే ఆకాష్ మాత్రం ఇప్పటికీ సినిమాల్లో తన అధృష్టాన్ని పరీక్షించుకుంటునే ఉన్నాడు.

 

తరుచూ వివాదాలతోనూ వార్తల్లోనూ నిలుస్తున్నాడు ఆకాష్‌. 2005లో తన తమిళ హిట్ సినిమా తెలుగులో డబ్‌ చేసి రిలీజ్ చేశాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావటంతో తెలుగు నిర్మాతలను తన సినిమాను సరిగా ప్రమోట్ చేయలేదంటూ ఆరోపిస్తూ రచ్చ చేశాడు ఆకాష్. 2009లో తమిళ నడిగర్‌ సంఘంతోనూ గొడవ పెట్టుకున్నాడు ఆకాష్.

మరింత సమాచారం తెలుసుకోండి: