మలయాళ సినిమాలకు మన తెలుగు లో ముందు నుంచి మంచి క్రేజ్ ఉంటుంది. అక్కడ ఏ సినిమా సూపర్ హిట్ అయిన సరే దానిని తెలుగు లో చేయడానికి ఇక్కడి స్టార్ హీరోల నుంచి దర్శక నిర్మాతల వరకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కథ కొంచెం నచ్చితే చాలు మన తెలుగు కి తగిన విధంగా కథను అన్ని విధాలుగా మార్పులు చేసి ఇక ఇక్కడ విడుదల చేయడానికి రెడీ అవుతారు. ఇక డబ్బింగ్ కూడా చేయడానికి ముందుకు వస్తు ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాను ఇక్కడ చేయడానికి రెడీ అయ్యారు. 

 

మలయాళంలో విజయవంతమైన `కప్పేలా` సినిమా రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ దక్కించుకుని ఇక్కడ చేయడానికి రెడీ అయ్యారు అని టాక్. లవ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కి విజయం సాధించిన `కప్పేలా` హక్కులను తీసుకుని ఇక్కడి స్టార్ హీరో లేదా ఒక చిన్న హీరో తో చెయ్యాలి అని సితారా యాజమాన్యం భావిస్తుంది. అదే విధంగా ఇటీవల `ఆయ్యప్పనుమ్ కోషియమ్` హక్కులను కూడా సితారా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రానా రవి తేజా హీరోలుగా తెచ్చే అవకాశం ఉంది. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు మరో సినిమా లూసిఫర్ కూడా తెలుగులో వస్తుంది. అలాగే నితిన్ కూడా ఒక సినిమాను ఇక్కడ చేయడానికి ముందుకు వచ్చాడు. ఇలా దాదాపు మూడు నాలుగు సినిమాలు మన తెలుగు లో రావడానికి ఆ భాష నుంచి రెడీ గా ఉన్నాయి అని అంటున్నారు. చూడాలి మరి ఎంత వరకు వస్తాయో... ఇక ఇప్పుడు నానీ కూడా ఒక సినిమాను అక్కడి నుంచి ఇక్కడ చేయడానికి చూస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: