అల్లరి నరేష్ హీరోగా 57వ సినిమాగా వస్తున్న నాంది సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు విజయ్ కనకమేడల. ఈమధ్యనే నరేష్ బర్త్ డే సందర్భంగా రిలీజైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. టీజర్ లోనే సినిమా అంచనాలను అందుకుంటుందని ఊహించి డైరక్టర్ కు వరుస ఛాన్సులు ఇస్తున్నారు. ఒకటి రెండు కాదు విజయ్ కు ఏకంగా మూడు ప్రొడక్షన్ హౌజ్ ల నుండి ఆఫర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. నాంది డైరక్టర్ నక్కతోక తొక్కడమే అంటే ఇదే కాబోలు. సినిమా నుండి వచ్చింది టీజరే అయినా నాంది సినిమా గురించి ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ వస్తుంది.

 

ఈసారి అల్లరి నరేష్ ను నిలబెట్టే సినిమా అవుతుందని అంటున్నారు. అందుకే నరేష్ డైరక్టర్ విజయ్ కు మూడు నిర్మాణ సంస్థల నుండి ఆఫర్స్ వచ్చాయి. అందులో మొదటిది ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, రెండోది ఏకె ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ నుండి ఆఫర్స్ వచ్చాయి. రిలీజైంది టీజరే కాని కుర్రాడికి ఆఫర్స్ మాత్రం అదిరిపోయాయి. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ లో రాం తాళ్లూరి నేల టికెట్ సినిమా ఈమధ్య వచ్చిన డిస్కో రాజా కూడా నిరాశపరచింది. ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఆల్రెడీ వరుస సినిమాలతో సూపర్ ఫాం లో ఉంది. ఇక ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ లో కీర్తి సురేష్ మిస్ ఇండియా సినిమా పూర్తి కాగానే విజయ్ సినిమా లైన్ లో పెట్టారు.

 

నాంది సినిమా రిలీజ్ కు ముందే డైరక్టర్ విజయ్ కు ఇలాంటి క్రేజీ ఆఫర్స్ రావడంతో.. యువ దర్శకులకు టాలీవుడ్ లో ఏ రేంజ్ డిమాండ్ ఉందో అర్ధమవుతుంది. అల్లరి నరేష్ నాంది అనుకున్న అంచనాలను అందుకుంటే మాత్రం ఇక విజయ్ కు వరుస ఛాన్సులు వచ్చినట్టే. మొదటి సినిమా నాంది రిలీజ్ అయ్యాక సెకండ్ మూవీ సెట్స్ మీదకు వెళ్లగనే.. అది షూటింగ్ మీద ఉండగా మూడో సినిమా కూడా చేస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలకు సంబందించిన కాస్ట్ అండ్ క్రూ ఎవరన్న్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: