కరోనా వైరస్ రాకతో సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. సరిగ్గా సమ్మర్ సీజన్ లో భారీ ఎత్తున సినిమాలు రిలీజ్ అవ్వాల్సిన టైములో ఈ వైరస్ రావడంతో దేశంలో అన్ని ఇండస్ట్రీలలో రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాల నిర్మాతలు చాలా నష్టపోయారు. వైరస్ ప్రభావం తో సినిమా షూటింగులు మొత్తం ఆగిపోవటం తో పాటు సినిమా థియేటర్లు కూడా క్లోజ్ అవడంతో చాలా నష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగను టైం లో మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ డబ్బులు బాగా దండుకున్నారు. మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తో మరియు బన్నీ 'అలా వైకుంఠపురంలో' సినిమాతో విజయాలను సాధించి ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర మంచి సత్తా చాటారు.

 

ఆ తర్వాత కుర్ర హీరో నితిన్ నటించిన 'భీష్మ' సినిమా కూడా రిలీజ్ అయ్యి బాగానే మొదటి లో కలెక్షన్లు రాబట్టింది. ఆ తరువాత మహమ్మారి వైరస్ రావటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇదిలావుండగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అజయ్ దేవగన్ నటించిన పీరియాడికల్ డ్రామా ''తన్హాజీ : ది అన్ సంగ్ వారియర్'' సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. సైఫ్ అలీఖాన్ - కాజోల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు. అజయ్ దేవగన్ నిర్మాణసంస్థ అదేవిధంగా టి సిరీస్ సంయుక్తంగా కలిసి నిర్మించిన ఈ సినిమా 3d లో రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించింది.

 

అజయ్ దేవగన్ 100వ చిత్రం 'తన్హాజీ'. సినిమా మొదటి లో అద్భుతమైన టాక్ రావడంతో ఫస్ట్ లో చాలా వరకు కలెక్షన్ వస్తున్న సమయంలో మహమ్మారి కరోనా వైరస్ రావటంతో … సినిమా థియేటర్లు క్లోజ్ అవటంతో భారీగా 'తన్హాజీ'  సినిమా కలెక్షన్ల కింద పడినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో ఇప్పుడు అప్పుడే సినిమా థియేటర్ లో ఓపెన్ అయ్యే పరిస్థితి కాకపోవడంతో అజయ్ దేవగన్ కి 'తన్హాజీ' సినిమా వల్ల లాభాలు లేకుండా పోయిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: