మొన్నటి వరకు నానీ సినిమాలు అనగానే చాలా మందికి ఒక క్రేజ్ అనేది ఉండేది. సినిమాలో ఉండే ప్రతీ కోణం కూడా చాలా బాగా గమనించే వారు. నానీ సినిమా వస్తుంది అంటే చాలు అమ్మాయిలకు మంచి పండగ. ఇక అతని సినిమాల్లో ఉండే లవ్ స్టోరీలు గాని అవి చూపించే విధానం గాని అందరిని చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. కథ విషయంలో అతను ముందు నుంచి కూడా చాలా వరకు జాగ్రత్తగానే ఉంటాడు. ఈ మధ్య కాలంలో నానీ సినిమాల్లో కథ కంటే  కూడా హడావుడి ఎక్కువగా ఉంటుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. 

 

ఇక ఇప్పుడు నానీ దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. కథల విషయంలో అతను కథకు ప్రాధాన్యత ఉండాలి గాని ఇతర విషయాలకు వద్దు అని భావించి తన తో సినిమా చేసే దర్శక నిర్మాతలకు స్పష్టంగా చెప్పేసాడు. కథ నచ్చలేదు అంటే అవాసరం అయితే మారుస్తా అని కూడా చెప్పాడు అని సమాచారం. మరి నిజం యెంత అనేది తెలియదు గాని ఈ విషయంలో స్టార్ దర్శకులు కూడా కాస్త జాగ్రత్త  పడుతున్నారు. అతను ఇటీవల త్రివిక్రమ్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది అనే   ప్రచారం జరిగింది. ఆ కథను నానీ మార్చేశాడు అని అంటున్నారు. 

 

కథలో కాస్త ఇబ్బందిగా ఉండటం తో మార్చాలి అని చెప్పాడు అని గతంలో తనకు దర్శకత్వంలో అనుభవం ఉండటం తో నానీ కూడా స్వయంగా కథను మార్చాడు అని అది త్రివిక్రమ్ కి కూడా నచ్చింది అని అంటున్నారు. ఎన్టీఆర్ తో సినిమా లేట్  అయితే నానీ తో త్రివిక్రమ్ చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. మరి చేస్తాడా లేదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: