అలియాభట్.. ఆర్ఆర్ఆర్ లో నటించడం లేదన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్స్ ఎప్పటికప్పుడు ఆగిపోయి రాజమౌళి అండ్ టీమ్ ఇబ్బందులు పడుతుంటే.. మధ్యలో అలియా హ్యాండ్ ఇచ్చిందంటూ వార్త పుట్టుకొచ్చింది. 

 

ఎనిమిదేళ్ల క్రితం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అలియాభట్  20కి పైగా సినిమాలు చేసినా.. ఇంతవరకు హిందీలో తప్ప మరో భాషలో నటించలేదు. ఫస్ట్ టైమ్ రాజమౌళి ఉన్నాడన్న ధైర్యంతో ఆర్ఆర్ఆర్ తో తెలుగులోకి అడుగుపెడుతోంది. 

 

ఆర్ఆర్ఆర్ లో అలియా రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా సెలక్ట్ అయి ఏడాది దాటింది. ఇంతవరకు సెట్స్ లోకి అడుగుపెట్టలేదు. మార్చి షెడ్యూల్ లో అలియాపై సీన్స్ ప్లాన్స్ చేయగా.. కరోనా అడ్డుకుంది. దీంతో అలియా ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకుందని వస్తున్న వార్త ఆర్ఆర్ఆర్ అభిమానులను నిరాశపరిచింది. 

 

ఆర్ఆర్ఆర్ నుంచి అలియాభట్ తప్పుకోవడం కానీ.. చిత్ర యూనిట్ మరో హీరోయిన్ని సెలక్ట్ చేసుకోవడం గానీ జరుగలేదు. ఇప్పట్లో షూటింగ్ కు రాలేని.. కరోనా తగ్గిన తర్వాతే వస్తానని అలియా చెప్పిందట. ప్రస్తుతం డేట్స్ ఇచ్చినా.. షూట్ చేసే పరిస్థితులు లేవు. ఆ మధ్య టెస్ట్ చేస్తే.. ఫెయిల్ అయింది. కరోనా మహమ్మారి తొలిగిపోయిన తర్వాతే షూట్ చేద్దామన్న నిర్ణయానికి రాజమౌళి వచ్చాడు. ఈ లెక్కన రామ్ చరణ్ హీరోయిన్ అలియానే. 

 

రాజమౌళి అనగానే సినీ ఇండస్ట్రీలోనే కాదు.. యావత్ ప్రేక్షకలోకం ఆయన వైపు ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సినిమా సినిమాకు కొత్త దనాన్ని పరిచయం చేసే దర్శక ధీరుడిపై ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. అంతటి ఆసక్తి కనుబరిచే ఆయన.. ఈ మధ్య చారిత్ర నేపథ్యం ఉన్న చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ చిత్రంలో ప్రేక్షక లోకాని ఏం చూపించబోతున్నారనేది ఇపుడు ఆసక్తిగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: