హీరోలు అంటే స్టైల్ గా ఉండాలి. అందంగా కనిపించాలి. హ్యాండ్సమ్ హంక్ లా సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు మెరిపించాలనే ఇమేజ్ లు పక్కకెళ్లిపోతున్నాయి. హాలీవుడ్ స్టైల్స్ ని ఫాలో అయ్యే హీరోలు కూడా కామన్ మెన్ లా మారిపోతున్నారు. రఫ్ అండ్ రగ్గడ్ లుక్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయడానికి వస్తున్నారు. 

 

అల్లు అర్జున్ స్టైల్స్ ని ఫాలో అయ్యేవాళ్లు బోల్డంత మంది ఉన్నారు. తెలుగు స్టేట్స్ తో పాటు, కేరళలోనూ బన్ని స్టైల్స్ ని ఫాలో అవుతుంటారు. అందుకే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా నిలిచాడు. కానీ ఈ హీరో మాత్రం కెరీర్ లోనే మొదటి సారి స్టైలిష్ లుక్ ని పక్కన పెట్టి, రస్టిక్ గా మారిపోయాడు. పుష్ప సినిమాలో పక్కా నాటు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో పుష్ప అనే సినిమా వస్తోంది. ఈ మూవీలో బన్ని రగ్గడ్ లుక్ తో కనిపించబోతున్నాడు. అచ్చమైన కూలీగా కనిపించేందుకు బ్రౌన్ మేకప్ వేసుకుంటున్నాడు.

 

వెంకటేశ్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. పైగా వెంకటేశ్ కామెడీ టైమింగ్ కు యూత్ లోనూ మాంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ కేటగిరి ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని హోల్ సమ్ ఎంటర్ టైనర్స్ లో నటిస్తుంటాడు వెంకీ. అయితే నారప్ప సినిమాతో మరో యాంగిల్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు వెంకటేశ్. 

 

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ నారప్ప అనే సినిమా చేస్తున్నాడు. తమిళ హిట్ అసురన్ రీమేక్ గా రూపొందుతోందీ చిత్రం. ఇందులో వెంకటేశ్ బీద రైతుగా నటిస్తున్నాడు. ఇక పాత్రకు తగ్గట్టు వెంకీ చాలా తక్కువ మేకప్ తో కనిపించబోతున్నాడు. సహజత్వానికి చాలా దగ్గరగా రగ్గడ్ లుక్ లో మెరవబోతున్నాడు. 

 

రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్స్ ని ఆడియన్స్ అంతగా ఎంకరేజ్ చేయట్లేదు. సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే టిక్కెట్లు తెగుతున్నాయి. వసూళ్లు పెరుగుతున్నాయి. అందుకే హీరోలు కూడా ప్రేక్షకుల పల్స్ ని క్యాచ్ చేస్తూ నేచురల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. 

 

రామ్ చరణ్ కెరీర్ లోనే స్పెషల్ మూవీ రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడికల్ డ్రామాలో చరణ్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో కనిపించాడు. సౌండ్ఇంజినీర్ చిట్టిబాబుగా జనాలను మాయ చేశాడు. ఈ పెర్పామెన్స్ కు మెగా రెస్పాన్స్ వచ్చింది. చరణ్ పెర్పామర్ గా మరో స్టేజ్ కు వెళ్లాడనే ప్రశంసలు అందుకున్నాడు. 

 

ఎప్పుడూ సిటీ కుర్రాడిగా మోడ్రన్ క్యారెక్టర్స్ ప్లే చేసే నాని ఇప్పుడు రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నాడు. సుకుమార్ అసోసియేట్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఇందులో నాని రగ్గడ్ లుక్ లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. నేచురల్ స్టార్ నాటు లుక్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నాడని చెబుతున్నారు. 

 

నాని ఇంతకుముందు కృష్ణార్జున యుద్ధం సినిమాలోనూ రగ్గడ్ లుక్ లో కనిపించాడు. పల్లెటూరి యువకుడు కృష్ణగా సందడి చేశాడు. అయితే ఈ సినిమా జనాలను అంతగా ఆకట్టుకోలేకపోయింది. నాని నాటు లుక్ కు అంతగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఈసారి అంతకుమించి నాటు సరుకు తెస్తాం అన్నట్టు రస్టిక్ క్యారెక్టర్ తో వస్తున్నాడట నాని. 

మరింత సమాచారం తెలుసుకోండి: