గతంలో తెలుగు సినిమా పాట 100 మిలియన్ వ్యూవ్స్.. అంటే 10కోట్లు దాటడం గగనమైపోయింది. సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో.. తెలుగు సినిమా పాట వెలిగిపోతోంది. 10కోట్ల వ్యూస్ ఏం ఖర్మ. ఏకంగా 25కోట్ల వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే మూడు పాటలు 250 మిలియన్ మార్క్ దాటేశాయి. 

 

తెలుగు సినిమాకు ముందుగా 200మిలియన్ మార్క్ వ్యూవ్స్ పరిచయం చేసిన సినిమా ఫిదా. సాయిపల్లవి, వరుణ్ కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదాలోని నచ్చిందే.. సాంగ్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు 25కోట్ల మంది చూశారు. ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటకు శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ ఇవ్వగా.. మధుప్రియ, రాంకీ ఆలపించారు. 

 

ఫిదా 200 మిలియన్ మార్క్ లో చేరిన తొలి సినిమాగా నిలిస్తే.. అల వైకుంఠపురములోని రాములో రాముల సాంగ్ తక్కువ టైమ్ లో ఎక్కువ వ్యూస్ సాధించింది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. తమన్ తన కెరీర్ లోనే.. అల వైకుంఠపురములోకు బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడు. 

 

యూట్యూబ్ లో 25కోట్లు మంది చూసిన మూడు తెలుగు పాటల్లో బన్నీ రెండు సొంతం చేసుకున్నాడు. అల వైకంఠపురములోని బుట్ట బొమ్మ సాంగ్ రీసెంట్ గా 250 మిలియన్ క్లబ్ లో చేరింది. ఈ క్రేజీ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. ఆర్మాన్ మాలిక్ ఆలపించాడు. 

 

250 మిలియన్ క్లబ్ లో చేరడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్నాడు. రంగస్థలంలోని రంగమ్మ సాంగ్ ను ఇప్పటికే 23కోట్ల మంది చూశారు. ఇంకో 2కోట్లు వ్యూస్ వస్తే చెర్రీ ఫస్ట్ టైమ్ 250 మిలియన్ మార్క్ దాటతాడు. మొత్తానికి తెలుగు పాటలు సంగీత ప్రియుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. అంతేకాదు రికార్డులు క్రియేట్ చేస్తూ ఆ సినీ నటులకు, మ్యూజిక్ డైరెక్టర్లకు మంచి క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: