ఓ వైపు కరోనా మహమ్మారి ఉంది. అది ఊపేస్తోంది. దాదాపు కోటి మంది దాకా జనాభా ఉన్న ఓ మినీ దేశంగా ఉన్న హైదరాబాద్ మీద కరోనా విరుచుకుపడుతోంది. కేసులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే కరోనా తగ్గినట్లుగా అనిపించినా ఇప్పట్లో ఈ వేడి, దాడి ఆగేలా లేదు. దాంతో సినిమాలు ఏంటి మొత్తం మూసుకుని కూర్చోవాల్సిన పరిస్థితి.

IHG's SS Rajamouli's 'RRR' means? Whole meaning of Jr ...

ఇవన్నీ ఇలా ఉంటే కరోనా పుణ్యామని గట్టి దెబ్బ తగిలిన సినిమా ఏదైన ఉందంటే అది కచ్చితంగా ఆర్.ఆర్.ఆర్ అని చెప్పాలి. ఈ సినిమా ఇంకా నలభై శాతం వరకూ మిగిలింది అంటునారు. అదే విధంగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ. దాంతో విదేశీ నటులు, టెక్నీషియన్లు కూడా ఉన్నారు. 

IHG's character from Rajamouli's 'RRR' - The ...

దాంతో అందరూ కలసి షూటింగ్ మొదలుపెట్టాలంటే కరోనా లేని ప్రపంచం రావాలి. సరే ఉన్నంతలో కొందరితోనైనా షూటింగ్ చేద్దామ‌‌న్నా కూడా కరోనా కొంత దూకుడు తగ్గించాలి. కానీ సీన్ చూస్తూంటే అలా లేదు. దాంతో కరోనా తగ్గాకే షూటింగ్ అంటున్నారుట. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్లు కూడా వరసగా మారుతున్నాయి.

IHG'RRR' మీరు అనుకునే కథ కాదు ...

నిజానికి అన్నీ అనుకున్నట్లుగా అయితే ఈ సినిమా ఈ జూలై 30న విడుదల కావాలి. కానీ ఆ తరువాత సీజే వర్క్స్, ఇతర టెక్నికల్ రీజన్స్ ని  ద్రుష్టిలో పెట్టుని 2021 సంక్రాంతికి ఈ మూవీని తోశారు. ఆ తరువాత కరోనా మొదలు కావడంతో సమ్మర్ కి వస్తుంది అనుకున్నారు. కానీ ఇపుడు సీన్ చూస్తొంటే వచ్చే ఏడాది జూలై 30న కానీ ఈ సినిమాను రిలీజ్ చేసే పరిస్థితి లేదు అన్నది ఇప్పటి మాట. అది కూడా ఏ నవంబర్ కో కరోనా శాంతించి అంతరాయం లేకుండా షూటింగ్ చేసుకోనిస్తే. లేకపోతే ఆ డేట్ కూడా మారేలా ఉందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: