రకుల్ ప్రీత్ సింగ్  కి అందంతో పాటు అభినయం కూడా ఉంది. అది రుజువు కూడా అయింది. ఇక ఆమె స్టార్ హీరోయిన్ గా ఒక రేంజిని ఎంజాయ్ చేసింది. టాప్ హీరోలు అందరి పక్కన యాక్ట్ చేసి శభాష్ అనిపించుకుంది. అయితే వరసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమెను పక్కన పెట్టేశారు. ఇది చిత్ర విచిత్ర సీమ కాబట్టి అది అలాగే అనుకోవాలి.

IHG

ఏది ఏమైనా రకుల్ కి టాలీవుడ్ మీద మోజు పోనట్లు లేదు. ఎందుకంటే ఎక్కడో ఉన్న తనను తీసుకువచ్చి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్స్ ఎక్కించి లక్కీ స్టార్ ని చేసింది టాలీవుడ్. పైగా చాలా బాగా చూసుకుని భారీ రెమ్యునరేషన్ కూడా ఇచ్చింది. ఓ దశలో తిరుగులేని స్టార్ డం అనుభవించింది కూడా.

IHG

ఇవన్నీ ద్రుష్టిలో పెట్టుకుని ఇపుడు కరోనా వేళ రకుల్ ప్రీత్ సింగ్ తన రెమ్యునరేషన్ని సగానికి సగం తగ్గించుకున్నారు. ఆమె తనంతట తానే ముందుకు వచ్చి తాను గతంలో తీసుకున్న దానిలో ఫిఫ్టీ పర్సంట్  తీసుకుంటానని చెప్పుకుంటున్నారు. నిజంగా ఇది మంచి పరిణామమే. ఇపుడున్న పరిస్థితుల్లో సినిమా ఫీల్డ్ ని నిలబెట్టాలంటే దాని వల్ల ఒకపుడు భారీగా లబ్ది పొందిన వారు ముందుకు రావాలి

IHG

తలా ఒక  చేయి వేయాలి. ఈ విషయంలో రకుల్ ని అంతా అభినందిస్తున్నారు. ఇక్కడ రకుల్ స్వార్ధం కూడా ఉంది.ఆమెకు ఇపుడు ఆఫర్లు ఎక్కడా లేవు. ఇపుడున్న పోటీలో ఆమె వెనక్కు వెళ్లారు. లాక్ డౌన్, కరోనా తరువాత ఆమె మళ్ళీ లైం లైట్ లోకి రావాలనుకుంటున్నారు. దానికి ఈ భారీ రాయితీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా రకుల్ మాదిరిగా మిగిలిన వారు కూడా ముందుకు వస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది అంటున్నారు. సరైన సమయంలో డెసిషన్ తీసుకున్న రకుల్ ని అంతా ఇపుడు అభినందిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: