బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచార. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఈరోజు విడుదలైయింది. ఈట్రైలర్ విడుదలైన 98 నిమిషాల్లోనే 1మిలియన్ లైక్స్ ను రాబట్టింది. తద్వారా వేగంగా యూట్యూబ్ లో మిలియన్ లైక్స్ రాబట్టిన రెండో ట్రైలర్ గా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బిగిల్ సినిమా యొక్క ట్రైలర్ కేవలం 60నిమిషాల్లోనే ఈఫీట్ సాధించింది. ఇక దిల్ బేచార ట్రైలర్ కు కూడా  యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
 
ఇక ఈచిత్రం థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలకానుంది. డిస్నీ+హాట్ స్టార్ ఈచిత్రాన్ని స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది అయితే కేవలం వీఐపీ సబ్ స్క్రిప్షన్ వున్న వారికి మాత్రమే కాకుండా నాన్ సబ్ స్క్రైబర్స్ కు కూడా హాట్ స్టార్ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం కలిపించింది.
 
ముఖేష్ చాబ్రా డైరెక్ట్ చేసిన ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా సంజనా సంఘీ హీరోయిన్ గా నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈచిత్రాన్ని నిర్మించింది. ఇదిలావుంటే గత నెలలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబైలోని బాంద్రాలో వున్న తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
 
ప్రస్తుతం సుశాంత్ మృతిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు అందులో భాగంగా ఇటీవల సుశాంత్  గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారించగా ఈరోజు ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని విచారించారు. మరో వైపు ఈకేసును సీబీఐకి  అప్పగించాలని సుశాంత్ ఫ్యాన్స్ కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: