కరోనా కి ముందు నుంచే డిజిటల్ స్ట్రీమింగ్‌ మీద ఆసక్తి చూపించారు చాలా మంది స్టార్ హీరోయిన్స్. ఒక్క హీరోయిన్ మాత్రమే కాదు సీనియర్ హీరోలు..ఫేడవుట్ అయిన హీరోయిన్స్ కి నటులకి డిజిటల్ స్ట్రీమింగ్‌ చాలా ఉపయోగపడుతుందని భావించారు. జగపతి బాబు లాంటి క్రేజ్ ఉన్న స్టార్స్ కూడా వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపించారు. అంతేకాదు వెబ్ సిరీస్ తో సైడ్ గా బాగా సంపాదించుకోవచ్చన్న ఆలోచన కూడా ఉండటం ఒక కారణం. పైగా హీరోయిన్స్ కైతే ఎక్కువగా స్కోప్ ఉంటుంది.

 

బాలీవుడ్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ నుంచి అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోను వెబ్ సిరీస్ లు రూపొందడం బాగా ట్రెండ్ అయింది. అయితే ఇప్పుడు కరోనా దెబ్బకు అందరికీ ఇదే బెస్ట్ కెరీర్ అని ఫిక్స్ అవుతున్నారు. సినిమాల కంటే ఇక్కడ బాగా సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. రకరకాల జోనర్స్ లోను రకరకాల పాత్రలు పోషించే అద్భుతమైన అవకాశం దక్కుతుంది. సినిమాల కంటే ఎక్కువ స్కోప్ వెబ్ సిరీస్ లో ఉంది. అదే అందరికీ ఇటువైపు రావడానికి ముఖ్య కారణం అవుతోంది.

 

ఈ క్రమంలోనే పెద్ద పెద్ద నిర్మాతలు కూడా వెబ్ సిరీస్ లను నిర్మించే సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ స్టార్స్ నుండి సీనియర్ స్టార్స్ వరకు డిజిటిల్ వైపు మళ్ళుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ‘ద ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో నటించింది. ఇందులో నెగిటివ్ రోల్ లో కనిపించనుందట. సీజన్ వన్ లో నటించిన ప్రియమణి కూడా సీజన్  2 లో కంటిన్యూ అవుతుంది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా ఓ వెబ్ సిరీస్ చేయనుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో త్రిష కూడా చేరింది. రామ సుబ్రమణ్యన్ ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తుండగా అనంద్ వికటన్ నిర్మాణం లో రూపొందనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: