సమంత.. టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్న సమంత కరోనా వైరస్ కారణంగా వంట నేర్చుకుంటుంది. సాధారణంగా ఏ అమ్మాయికి అయినా అద్భుతంగానో.. చెత్తగానో ఏదో ఒకలా అయితే వంట వచ్చి ఉంటుంది. కానీ మన పాప సమంత పూర్తిగా నటనకే అంకితం అవ్వడంతో ఏ వంట రాదు. 

 

IHG

 

ఇంకా ఎన్నో సార్లు వంట నేర్చుకోవాలని ప్రయత్నించినప్పటికీ సమంతకు సమయం లేదు. అందుకే ఈ కరోనా వైరస్ నియంత్రించేందుకు లాక్ డౌన్ అమలు చేసి షూటింగ్ లు బంద్ చెయ్యడంతో సమంత ఇంటికే పరిమితం అయ్యింది. దీంతో సమంత వంట నేర్చుకునే పనిలో బిజీ అయిపోయింది.

 

IHG

 

ఓ శిక్షకురాలి ఆధ్వ‌ర్యంలో స‌మంత వంట ఎలా చేయాలో నేర్చుకుంటోంది. ఇంకా ఆమె ప్ర‌త్యేకంగా వంట క్లాసుల‌కు హాజరవుతున్నట్టు సమంత చెప్పుకొచ్చింది. తాను నేర్చుకున్న వంటల ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వంట ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

 

IHG't get your eyes off ...

 

అయితే సమంత శిక్షకురాలిని పెట్టుకొని మరి వంట నేర్చుకుంటుంటే నాగచైతన్యకు మాత్రం ఇప్పటికే వంట చెయ్యడం వచ్చేసింది. ఇంకా ఈ లాక్ డౌన్ లో సమంత కోసం నాగ చైతన్య వంట చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏది ఏమైనా సమంత ఈ లాక్ డౌన్ వంట ఎలా చేయాలో నేర్చేసుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: