దర్శకుడు సుకుమార్ తో సినిమాలు చేసే హీరోలు అనేక టార్చర్లకు సిద్ధపడాలి. అందువల్లనే సుకుమార్ సినిమాలలో నటించే హీరోలకు చాల ఓర్పు ఉండాలి అని చెపుతూ ఉంటారు. ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా ‘పుష్ప’ చిత్రీకరణను అక్టోబర్ నుండి మొదలుపెట్టి తీరాలని ఒక స్థిర నిర్ణయం సుకుమార్ తీసుకున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.


ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి సమీపంలో ఒక అడవి బ్యాక్ డ్రాప్ లో గిరిజన గ్రామాన్ని ‘పుష్ప’ కోసం ఎంపిక చేసుకున్న సుకుమార్ అక్కడ రోడ్లు చదును చేసి షూటింగ్ చేసేందుకు తన టీమ్ చేత ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అక్కడ బన్ని పై కీలక సన్నివేశాలను  చిత్రీకరించాల్సి ఉందిట. అయితే అడవులు కొండకోనల్లో షూటింగులు అంటే అక్కడికి సరైన వాహన సౌకర్యం ఉండదుకాబట్టి కాలినడకన కొంతదూరం నడవ వలసి వస్తుందని ఇప్పటికే సుకుమార్ అల్లు అర్జున్ ను మానసికంగా సిద్ద్గం చేసినట్లు తెలుస్తోంది.  


అందువల్ల చిత్రబృందంతో పాటు బన్ని కూడ  ఫిజికల్ గా ఫిట్ గా ఉండాల్సి ఉంటుంది కాబట్టి  అల్లు అర్జున్ ను  చాలా ముందస్తుగానే ప్రిపరేషన్ మొదలు పెట్టమని సుకుమార్ సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అల్లు అర్జున్ మొన్న ఆదివారం తెల్లవారుజామున ప్రాంతంలో హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో గంటల తరబడి జాగింగ్ చేస్తున్నాడు. ఇలా చేయడానికి బన్నీ కేబీఆర్ పార్క్ వెలుపల జాగింగ్ ట్రాక్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రోజు తెల్లవారుఝామున 4 గంటలకు నిద్రలేచి ఇంకా జనం రోడ్ పైకి రాకుండానే క్రమం తప్పకుండా ఈ ట్రాక్ లో బన్ని జాగింగ్ చేస్తున్నాడట.


‘పుష్ప’ చిత్రీకరణలో భాగంగా కొండల పై ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి మానసికంగా సిద్దపడటానికి బన్ని పరసతిరోజు గంటల తరబడి  కాలినడ నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈవిషయం పై  బన్ని అశ్రద్ధ చేయకుండా బన్నితో పాటు అతడి భార్య  భార్య స్నేహా రెడ్డి ని కూడా జాగింగ్ కు తీసుకు వెళుతూ సుకుమార్ సూచనలు పొల్లుపోకుండా అమలుపరుస్తున్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: