భారతీయ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే ఎనలేని పాపులారిటీని సంపాదించుకున్నాడు. హారర్ యాక్షన్ థ్రిల్లర్ వంటి అన్ని జోనర్లలో సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా ఎక్కువగా బయోపిక్స్ తీస్తున్నాడు. రక్తచరిత్ర 1, రక్త చరిత్ర 2, వంగవీటి, కిల్లింగ్ వీరప్పన్, లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలను నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించి సంచలనం సృష్టించాడు.


ఇప్పుడు కూడా పవర్ స్టార్, మర్డర్ వంటి సినిమాలను చేస్తూ చిక్కులో పడుతున్నాడు. మొన్నీమధ్య అమృత ప్రణయ్ మారుతీరావు నిజ జీవితాలపై సినిమా చేస్తున్నానంటూ వారి ఆగ్రహానికి కారణమయ్యాడు. అతనిపై మిర్యాలగూడలో ఒక్క కేసు కూడా నమోదు అయ్యింది. ఇవన్నీ అతనికి చిన్న విషయాలే అయినప్పటికీ ఈ విపత్కర పరిస్థితులలో తీస్తున్న సినిమా కి ఆటంకాలు ఎదురైతే కాస్త ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించే పవర్ స్టార్ చిత్రానికి కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం అచ్చం పవన్ కళ్యాణ్ లాగా కనిపించే పవన్ కళ్యాణ్ డూప్ ని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేశాడు.

భద్రాచలానికి చెందిన అతని పేరు చర్ల కోటి నరేష్ కాగా అతడు అత్తారింటికి దారేది లోని పవన్ కళ్యాణ్ వేసుకున్న కాస్ట్యూమ్ ధరించి అచ్చం పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ నరేష్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అట. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో వీడియో లు చేస్తూ పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ బాగా ఫేమస్ అయ్యి ఎట్టకేలకు నరేష్ రాంగోపాల్ వర్మ దృష్టిలో పడ్డాడు. ఆ విధంగా అతడిని ఎంపిక చేసుకోగా... పవర్ స్టార్ బయోపిక్ స్క్రిప్టు వినగానే అది నచ్చని నరేష్ తన ఫేవరెట్ హీరోకి తానే అన్యాయం చేయాలని రాంగోపాల్ వర్మ కి తేల్చి చెప్పేసింది ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో చేసేదేమీ లేక పవర్స్టార్ బయోపిక్ విషయంలో వర్మ వెనక్కి తగ్గాడు అని తెలుస్తోంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: