సౌత్ క్రేజీ బ్యూటీ త్రిష సినిమాల్లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్ధాలుగా కావొస్తుంది అయినా కూడా అమ్మడు ఇప్పటికి సినిమాలు చేస్తూనే ఉంది. ఇలా వచ్చి అలా వెళ్లే భామలున్న ఈరోజుల్లో ఒకటి రెండు కాదు 18 నుండి 20 ఏళ్లు సినిమాలు చేయడం అంటే అది మాములు విషయం కాదు. కెరియర్ లో కొన్నాళ్లు వెనుకపడ్డా మళ్లీ ప్రయత్నాలు చేసి సక్సెస్ ఫాం కొనసాగిస్తుంది త్రిష. ఇక ఇప్పుడు కూడా మారుతున్న ఆడియెన్స్ టేస్ట్ కు తగినట్టుగా త్రిష కూడా కొత్త మార్గాలు ఎంచుకుంటుంది.  

 

సినిమాలే కాకుండా డిజిటల్ ఫ్లాట్ ఫాం లో కూడా ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి. అందుకే త్రిష ఇప్పుడు వెబ్ సీరీస్ లను చేసేందుకు సై అని చెబుతుంది. ఈమధ్య హీరోయిన్స్ వెబ్ సీరీస్ లు చేయడం చాలా కామన్ అయ్యింది. అయితే త్రిష మాత్రం ఇప్పటివరకు సినిమాలు చేస్తూ వచ్చింది. కాని ఇప్పుడిక డిజిటల్ టర్న్ తీసుకోక తప్పలేదు. సుబ్రమణ్యం డైరక్షన్ లో వచ్చే వెబ్ సీరీస్ లో త్రిష హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంసంథ నిర్మిస్తుందట. 

 

మొత్తానికి అందరితో పాటే తను అన్నట్టుగా త్రిష తన వెబ్ సీరీస్ లతో కూడా సత్తా చాటాలని చూస్తుంది. త్రిష చేసే ఈ వెబ్ సీరీస్ లు ఎలాంటి ప్రేక్షకారణ పొందుతాయో చూడాలి. ఒకప్పుడు గ్లామర్ షోలకు కూడా నో చెప్పే త్రిష ఈమధ్య సినిమాల్లో రెచ్చిపోతుంది. ఇక వెబ్ సీరీస్ అంటేనే అడల్ట్ కంటెంట్ కు ప్రాముఖ్యత ఇస్తారు. మరి ఈ వెబ్ సీరీస్ లకు త్రిష తనని ఎలా ప్రెజెంట్ చేసుకుంటుందో చూడాలి. ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా తనకు మాత్రం తిరుగులేదని ప్రూవ్ చేసుకుంటుంది అమ్మడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: