హీరోయిన్ల పెళ్లి గురించి ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోలు కూడా హైరానా పడుతున్నారు. ముఖ్యంగా నిత్యామీనన్ పెళ్లి గురించి దుల్కర్ సల్మాన్ తెగ ఆలోచిస్తున్నాడట. ఆలోలించడమే కాదు.. నిత్యకు పెళ్లి వల్ల కలిగే ప్రయోజనాలు అంటూ క్లాసులు కూడా తీసుకుంటున్నాడట. మరి జూనియర్ సౌందర్య పెళ్లిపై దుల్కర్ కు ఎందుకంత ఇంట్రెస్ట్. ఆల్ రెడీ భర్త గా మారిన దుల్కర్ నిత్యపెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడంటే.. 

 

దుల్కర్ సల్మాన్ కంప్లీట్ ఫ్యామిలీ మెన్. షూటింగ్ లు లేకపోతే కూతురు మరియం అమీరా సల్మాన్ తో ఆటలాడుతుంటాడు. క్వారంటైన్ లో కూడూ కూతురుని ఆడించడానికే ఎక్కువ సమయం కేటాయించాడు. అయితే భార్య, పిల్లలతో పాటు నిత్య మీనన్ గురించి ఆలోచిస్తున్నాడట దుల్కర్ సల్మాన్. 

 

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్లిద్దరూ కలిసి మూడు సినిమాల్లో నటించారు. బెంగళూర్ డేస్, ఓకే రుక్మిణి, 100డేస్ ఆఫ్ లవ్ తో  ఇంప్రెస్ చేశారు. ఈ సినిమాల షూటింగ్ టైమ్ లోనే వీళ్లిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ స్టార్ట్ అయింది. ఈ ఫ్రెండ్ షిప్ కొద్దీ నిత్యామీనన్ కి పెళ్లి పాఠాలు బోధించాడట దుల్కర్. 

 

నిత్యామీనన్ వయసు ఇప్పుడు 32 సంవత్సరాలు. థర్టీ ప్లస్ లోకి వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నిత్యకు సజిషల్ ఇచ్చాడట దుల్కర్. పెళ్లి చేసుకొని తాను చాలా హ్యాపీగా ఉన్నాననీ.. పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుందని నిత్యకు సలహా ఇచ్చాడట దుల్కర్ సల్మాన్. ఈ పెళ్లి ముచ్చట్లను నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది. మరి అభిమానులతో పాటు, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ చెబుతున్నా ఇంకా నిత్య పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదని అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నిత్యామీనన్ పెళ్లిపై దుల్కర్ సల్మాన్ కు మంచి ఇంట్రెస్టే ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: