భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్లుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు రజినీకాంత్, కమల్ హాసన్. ఇద్దరి కెరీర్లు ఒకేసారి ఆరంభించినా.. ఎవరి స్టైల్లో వారు తమ ఇమేజ్ ని పెంచుకున్నారు. కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక సంఖ్యలో అభిమానులు సంపాదించుకున్న వారిలో రజినీకాంత్ తో పాటు కమల్ హాసన్ ఒకరు.  ఈ ఇద్దరు హీరోలకు మంచి లైఫ్ ఇచ్చింది కె.బాలచందర్.  కెరీర్ బిగినింగ్ లో రజినీకాంత్ విలన్ గా కూడా నటించారు.  ఇక ఇప్పటి వరకు సీనీ ప్రపంచంలో ఎవరూ చేయని వినూత్న ప్రయోగాలు కమల్ హాసన్ చేశారు.  సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ అంటే ఇప్పటికీ ఫాలో అవుతుంటారు తమిళ తంబీలు.  వీరిద్దరు కలిసి నటించిన సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత స్టార్ హీరోలుగా మారిన తర్వాత సినిమాలకు సంబంధించి మార్కెట్ పరంగా అప్పుడప్పుడు వీరిమధ్య పోటీ జరిగినప్పటికీ ఒకరు నటనతో హిట్టు కొడితే మరొకరు కలెక్షన్స్ తో సక్సెస్ అవుతుంటారు.

 

అయితే పరిస్థితులు ఎలా ఉన్నా కమల్ రజినీకాంత్ వ్యక్తిగతంగా మంచి మిత్రులుగానే ఉంటున్నారు. ఇక  రజనీకాంత్ హీరోగా కమలహాసన్ ఒక మూవీ నిర్మిస్తున్నట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే, ఇటీవల మళ్లీ మూవీ గురించి అప్ డేట్స్ లేకపోవడంతో ఈ ప్రాజక్టు ఆగిపోయి ఉంటుందని కోలీవుడ్ లో ప్రచారం జరిగింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే.

 

ప్రస్తుతం తమిళనాడులో కరోనా కేసులు బాగా ఉన్నాయి. అయితే, ఈ ప్రాజక్టు నిలిచిపోలేదనీ, ఈ నవంబర్లో సెట్స్ కి వెళుతుందనీ సమాచారం. తాజాగా విజయ్ తో 'మాస్టర్' మూవీని రూపొందించిన లోకేశ్ కనగ రాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: