తెలుగులో కెరియర్ దాదాపు ముగిసిందని అనుకుంటున్న ముద్దుగుమ్మ ఏడాది కాలంగా ఒక్క మూవీ ఛాన్స్ కూడా అందుకోలేదు. ఓ సీనియర్ స్టార్ తో సినిమా చేసి అందులో మ్యాక్సిమం బోల్డ్ గా కనిపించినా వర్క్ అవుట్ కాలేదు సరికదా ఆ సినిమా డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. అంతకుముందు ఓ స్టార్ హీరో సినిమాలో నటించినా లాభం లేకుండాపోయింది. ఈమధ్యనే ఓ యువ హీరో సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు టాక్ వచ్చింది. అయితే ఎలాగు కెరియర్ లో పెద్దగా అవకాశాలు లేవు.. కరోనా వల్ల నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారని హీరోయిన్ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది.

 

ఇప్పటివరకు ఆమె తీసుకునే రెమ్యునరేషన్ ను సగానికి తగ్గిస్తూ ఇక మీదట చేసే సినిమాలకు అదేవిధంగా 50 శాతం రెమ్యునరేషన్ నే తీసుకునేలా ప్లాన్ చేస్తుందట. ఇదివరకు కోటి ఫాం లో ఉన్నప్పుడు కోటిన్నరకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన ఈ హీరోయిన్ కు ఇప్పుడు లక్ ఏమాత్రం కలిసి రావట్లేదు. అంతేకాదు యువ హీరోయిన్ల పోటీ కూడా ఎక్కువవడం.. కొత్తగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంతో ఆమె అవకాశాలకు గండి పడ్డది.

 

అందుకే తన రెమ్యునరేషన్ తగ్గించి నిర్మాతలకు సహాయం చేసినట్టుగా చేస్తూనే సగానికి తగ్గించిన రెమ్యునరేషన్ తో కొత్త అవకాశాలు వస్తాయనే ఆశతో ఉంది ఈ అమ్మడు. యువ హీరో సినిమాతో మొదలైన ఆమె టాలీవుడ్ కెరియర్ స్టార్ హీరోలతో జోడీ కట్టేలా క్రేజ్ దక్కించుకుంది. అయితే సరైన కథల ఎంపిక చేసుకోలేక అమ్మడు ఈమధ్య వరుస ఫ్లాపులు చేస్తుంది. అందుకే కెరియర్ లో వెనకపడ్డది. మరి తగ్గించిన ఈ రెమ్యునరేషన్ తో అయినా ఆమెకు వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.             

మరింత సమాచారం తెలుసుకోండి: