అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ మీద రావు రమేష్ ఓ డైలాగ్ వేస్తాడు.. మురళి శర్మని, రావు రమేష్ లను ఓ ఆట ఆడుకుంటున్న టైంలో ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని హీరో పాత్ర గురించి వీడి చర్యలు ఊహాతీతం అంటూ డైలాగ్ వాడతాడు. త్రివిక్రం రాసిన డైలాగ్ ఆ సన్నివేశానికి పర్ఫెక్ట్. అయితే రియల్ లైఫ్ లో ఆ డైలాగ్ వాడాలంటే మాత్రం అది సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకే సూట్ అవుతుంది. తను చేసేది చేసుకుంటూ వెళ్తూ ఎవరేమి అడిగినా సమాధానాలు చెప్పి సమర్ధించుకునే ఆర్జివి ఈమధ్య మరీ రెచ్చిపోతున్నాడు.

 

అందరు లాక్ డౌన్ టైం లో ఇల్లకే పరిమితమైతే వర్మ మాత్రం రెండు సినిమాలు రిలీజ్ చేయగా మరో రెండు సినిమాల ట్రైలర్స్ వదిలాడు. లేటెస్ట్ గా మరో థ్రిల్లర్ సినిమా కోసం ఓ అప్సరసని దించుతున్నాడు. అయితే ఆల్రెడీ రెండు సినిమాల్లో నటించిన అంకేత మహరన. ఆమెతో ఓ హాట్ ఫోటో షూట్ చేయించి ఆమెను కొత్త అమ్మాయిగా ప్రమోట్ చేస్తూ పేరు కూడా మీర్చేశాడు ఆర్జివి. ఇక అంతటితో ఆగితే బాగుండేది ఎప్పుడు లేనిది డైరెక్ట్ గా అమ్మడికి ముద్దు ఇస్తూ వర్మ సెల్ఫీ దిగడం విశేషం. బహుశా వర్మ ఇలా రొమాంటిక్ మూడ్ లో చూడటం ఇదే మొదటిసారి.

 

అంతకుముందు నైనా గంగూలితో బ్యూటిఫుల్ సినిమా చేసిన టైం లో ఆమె కాళ్ల మీద పడ్డ వర్మ అదే అరాచకం అనుకుంటే ఇప్పుడు ఏకంగా అప్సరతో ముద్దు ముచ్చట్లతో హాట్ న్యూస్ గా నిలిచాడు. ఎవరైనా ఏదైనా అనుకుంటారన్న ఫీలింగ్స్ అసలేమి వర్మకు ఉండవు. అయినా అలా పట్టించుకునే వాడైతే ఆయన వర్మ ఎందుకవుతాడు చెప్పండి. అందుకే ఇలాంటివన్ని చూసి వర్మ చర్యలు ఊహాతీతం అనుకోవడం తప్ప చేసేదేమి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: