బాలీవుడ్ లో 1920 సినిమాలో తన నటనతో మెప్పించిన అదా శర్మ పూరి కంట్లో పడి హార్ట్ ఎటాక్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. తెలుగులో ఆమెకు మంచి క్రేజ్ వచ్చినా సరైన సినిమాల ఎంపిక చేసుకోకపోవడంతో కెరియర్ లో వెనుకపడ్డది. తెలుగులో చిన్నా చితకా పాత్రలతో కెరియర్ సరిపెట్టుకుంటున్న అదా శర్మ తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. బాలీవుడ్ లో కూడా అడపాదడపా అదృష్టాన్ని పరీక్షిచుకుంటుంది ఈ అమ్మడు. లాస్ట్ ఇయర్ తెలుగులో కల్కి, హిందిలో కమాండొ 3, బైపాస్ రోడ్ సినిమాల్లో నటించింది అదా శర్మ. 

 

సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అదా శర్మ వారానికో వీడియోతో సర్ ప్రైజ్ చేస్తుంది. రకరకాల ప్రయత్నాలతో ఆమె చేసే వీడియోలు ఆమెకు క్రేజీ ఫాలోయింగ్ ఏర్పడేలా చేశాయి. యోగా ఆసనాల దగ్గర నుండి ఏది పడితే అది చేసేస్తుంది అదా శర్మ. లేటెస్ట్ గా టెర్రస్ మీద తన టాలెంట్ చూపించేస్తుంది. చెక్ షర్ట్ వేసుకుని దాచాల్సినవి కనిపించేలా బహుశా ఆడియెన్స్ కు కనువిందు కోసమేమో కాని అమ్మడు చేసిన ఈ ఫోటో సెషన్ హాట్ న్యూస్ గా మారింది. ఏదైనా సినిమాల్లో కన్నా ఫోటో షూట్ తోనే అదా శర్మ ఎక్కువ క్రేజ్ సంపాదించిందని చెప్పొచ్చు.

 

ప్రస్తుతం చేతిలో సినిమాలేమి లేవనుకుంటా అందుకే ఐడెంటిటీ కాపాడుకునేందుకు ప్రయత్నాలన్ని చేస్తుంది. తనలో ఉన్న టాలెంట్ మొత్తం ఇలా బయటపెట్టేస్తున్న అదా శర్మకు ఇప్పటికైనా లక్ కలిసి వచ్చి తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని ఆశిస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఈమధ్య వాణిజ్య ప్రకటనల్లో ఎక్కువగా కనిపిస్తున్న అమ్మడు ఈ సోషల్ మీడియా ఫాలోయింగ్ కనీసం యాడ్స్ వచ్చేలా అయినా చేస్తున్నందుకు సంతోషమని చెప్పాలి.           

మరింత సమాచారం తెలుసుకోండి: