కొంతమంది హీరోయిన్స్ సినిమాలైతే చేస్తుంటారు కాని అందుకు తగినట్టుగా క్రేజ్ సంపాదించడంలో మాత్రం వెనకపడతారు. శర్వానంద్ రన్ రాజా రన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సీరత్ కపూర్ సోలో హీరోయిన్ గా సినిమాలు చేసినా సరే ప్రేక్షకుల్లో ఐడెంటిటీ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యింది. రాజు గారి గది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు లాంటి సినిమాల్లో నటించిన అమ్మడు ఆ సినిమాల్ల ఫైతాలు అమ్మడి కెరియర్ మీద ఎఫెక్ట్ పడేలా చేశాయి. ఛాన్స్ వస్తే ఎలా రెచ్చిపోయేందుకైనా సిద్ధమే అని చెబుతున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా నటించిన కృష్ణ అండ్ హిస్ లీల సినిమాతో ప్రశంసలు అందుకుంది.

 

సినిమాలో అమ్మడి నటనకు హరీష్ శంకర్ లాంటి డైరక్టర్ స్పెషల్ మెన్షన్ చేసి మెచ్చుకున్నాడు అంటే ఆమె ఎంత ఆకట్టుకుందో చెప్పుకోవచ్చు. ఇక ఇదే కాదు ప్రస్తుతం సీర కపూర్ చేస్తున్న మా వింత గాథ వినుమా సినిమాలో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర చేస్తుందట. తప్పకుండా తన కెరియర్ టర్న్ చేసే పాత్ర ఇది అని అంటుంది సీరత్. హీరోయిన్స్ వాంటింగ్ ఉండే టాలీవుడ్ లో ఇలాంటి భామలను ఎంకరేజ్ చేస్తే బాగానే ఉంటుంది.

 

మరి కెరియర్ టర్న్ తిప్పే పాత్ర అని స్పెషల్ గా చెబుతుంది అంటే నిజంగానే సీరత్ ఆ పాత్రని ఎలా చేసిందో చూడాలి. చిన్న బడ్జెట్ తో వస్తున్న మా వింత గాథ వినుమా సినిమా కూడా ఓటిటిలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ వస్తుందట. స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలకు బడ్జెట్ కన్నా కొద్ది మొత్తం ఇచ్చి డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేస్తున్నారు. టేబుల్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి దర్శక నిర్మాతలు కూడా అందుకు ఓకే చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: