లాక్ డౌన్ సమయంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు నష్టపోయారు కానీ రాంగోపాల్ వర్మ రెండు చిత్రాలను డిజిటల్ ప్రపంచంలో విడుదల చేసి కోట్ల రూపాయలను సంపాదించాడు. అతని పుణ్యమా అంటూ మియా మాల్కోవా, శ్రీ రాపాక(స్వీటీ) హీరోయిన్లు కూడా బాగానే డబ్బులు సంపాదించుకున్నారు. క్లైమాక్స్, నగ్నం చిత్రాలు ప్రేక్షకులను కొంచెం కూడా అలరించలేదు కానీ ఇందులో నటించిన భారతీయ హీరోయిన్ స్వీటీ బాగా పాపులర్ అయ్యింది.


ఫోన్ తో ఆమె అందాలను చిత్రీకరించిన రామ్ గోపాల్ వర్మ సెగలు పుట్టించాడు అని చెప్పుకోవచ్చు. బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ స్వీటీ ని చాలా మంది యూట్యూబ్ చానల్ వాళ్లు పిలిచి ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు. అయితే ఈ క్రమంలోనే ఆమె సినీ పరిశ్రమలో ప్యాషన్ డిజైనర్ గా పని చేసిందని తెలిసింది. దాదాపు 55 సినిమాలకి ఈమె ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసిందట. హీరో నాని, విజయ్ దేవరకొండ, తనీష్ అప్పట్లో బాగా మాట్లాడే వారిని తనకు వారితో బాగా పరిచయం ఉందని తెలిపింది. అయితే వీళ్ళతో పరిచయాలు ఉన్నప్పటికీ తనకిష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆమె కలుసుకోలేక పోయిందట. ఒకవేళ ఈ ముగ్గురు హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తే ఈమెకు తన ఫేవరేట్ హీరోని కలిసే అవకాశం లభిస్తుంది. కానీ ఈమె మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా కలవాలని ఎవరి సహాయం ఆమెకు అవసరం లేదని, కలవాలని దృఢంగా నిశ్చయించుకుంటే కచ్చితంగా ఏదో ఒక రోజున కలుస్తానని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది.


అయితే పవన్ కళ్యాణ్ అంటే తనకు బాగా ఇష్టమని... తను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్లిపోతానని... డేటింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నానని బోర్డ్ కామెంట్ చేసి అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది స్వీటీ. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఒక వేళ ఏదైనా మిరకిల్ జరిగి పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ వస్తే తన జన్మ ధన్యమవుతుంది అని ఆమె చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఈ నగ్నం హీరోయిన్ యొక్క కోరికలు నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: