టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి దేశవ్యాప్తంగా ఓ రేంజ్లో చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి బాహుబలి ది కంక్లూజన్ తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ క్రేజీ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.
ఇద్దరు చారిత్రక యోధుల పేర్లతోనూ.. వారి జీవితాల్లో కొంత భాగం ఆధారంగా తెరకెక్కే ఈ సినిమా ఎలా ఉంటుందా ? అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ సినిమా అని కొందరు అంటుంటే మరి కొందరు దేశ భక్తి సినిమా అని చెపుతున్నారు. అయితే రాజమౌళి మాత్రం వీటిని కొట్టి పడేశారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహం అని చెప్పారు. ఈ మాటలు విన్న ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్ని హైలెట్ సీన్లు ఉంటాయి ? ఏయే సీన్లు హైలెట్ అవుతాయన్న అంచనాల్లో ఇప్పటికే ఎవరికి వారు మునిగి తేలుతున్నారు. అయితే ఎన్టీఆర్ నటించే ఓ సీన్ గురించి ఇప్పుడు ఆసక్తికర వార్త హైలెట్ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేయనున్నాడట. ఆ సీన్ లీక్ అయిందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ భారీ ఫైట్ సినిమాకే హైలైట్ కానుందని అంటున్నారు.
వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నా.. కరోనా నేపథ్యంలో ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుందో ? ఎప్పుడు రిలీజ్ అవుతుందో ? కూడా తెలియడం లేదు.